21, నవంబర్ 2010, ఆదివారం

పెసరట్టు + అల్లప్పచ్చడి + బ్రూ కాఫీ

భాస్క్రర్ రామరాజుగారు వారాంతంలో ఉల్లిపెసర కుమ్మారంట, బొమ్మలు చూపించి నోరూరించారేగానీ ఎలా చెయ్యాలో చెప్పలా. అహా! నాకు రాదనికాదు, ఇంటర్నెట్లో దృశ్యాలు దొరకవనికాదు; తోటి గుంటూరువాడికి స్థానిక పద్ధతిలో చెప్తారని.

అందుకే, నేను ఇవాళ పొద్దునే (పదకొండుకి) లేచి చేసేశా. పనిలోపని అల్లప్పచ్చడి కూడా చేశా. పెసరట్లు కుమ్మాక చిక్కటి కాఫీ గొంతులో పడితేనేగా మజా. ఫిల్టరు కాఫీ లేదు, ఏం చేస్తాం, బ్రూ కాఫీతో సరిపుచ్చా.

బ్రహ్మచారి ఒక్కడే అమెరికాలో చీజ్ పిజ్జాలు- వెజ్ బర్గరులు తినలేక కష్టపడుతున్నాడని పాపం ఇంట్లోవాళ్ళు తల్లడిల్లుతుంటారు, మనం ఇక్కడ రోజూ కుమ్ముతున్నామని చెప్పినా నమ్మట్లా. అందుకే వాళ్ళకోసం, నోరూరించి నాలో పౌరుషం+పట్టుదల రగిలించిన భాస్కర్‌‌గారి కోసం ఈ క్రింది చిత్రము.

 
Posted by Picasa

40 కామెంట్‌లు:

  1. :) ఖమించండి. సమయాభవంవల్ల వెనువెంటనే రిప్లై ఇవ్వలేకపొయ్యా...

    రిప్లయితొలగించండి
  2. ఇప్పుడు మీరు మా అందరికీ నోరూరిస్తున్నారుగా! ;)

    రిప్లయితొలగించండి
  3. కాఫీ గీఫీ కాదుగానీ(మేము టీ పార్టీ గాబట్టి) బొమ్మలుమాత్రం కేక.. టేస్టుగూడ బాగనే వచ్చుండొచ్చు. చూస్తే అర్థమయితుందిగా.. కాని మాకు పెసరపిండి దొరకట్లేదన్నా :( మామూలు మినప్పిండితోనే సరిపోతుంది మా జీవితం.

    రిప్లయితొలగించండి
  4. ఆదివారం పొద్దున్నే ఇలా నోరూరించడం బాగుందా అసలు?
    బాగున్నాయి మీ పెసరట్లు,అల్లం పచ్చడి

    రిప్లయితొలగించండి
  5. I hate Pesarattu. Some ppl like Upma with Pesarattu. I hate that combination.

    రిప్లయితొలగించండి
  6. @వేణూశ్రీకాంత్‌‌గారు: :)
    @భాస్కర్‌‌గారు: అంత పెద్దమాటలొద్దండి, మీరు గుర్తుచేసి నోరూరించబట్టేకద, నాకు చేయాలనిపించింది :-) నాకు, "అండీ" గూడ కలపొద్దు.
    @మధురవాణిగారు: ఐతే మీరుకూడా చేసెయ్యండి.
    @సుదర్శన్‌‌గారు: నేనూ రెండూ తాగుతాగానీ, పెసరట్టుతో కాఫీనే బాగుంటుంది.
    @రిషిగారు: :)

    రిప్లయితొలగించండి
  7. @అజ్ఞాత: మీరు సరైనచోట తినలేదేమో! ఉప్మా-పెసరట్టు కలిపి నాక్కూడా ఇష్టంలేదు, ఎందుకంటే నాకూ ఉప్మాకి సరిపోదు.

    రిప్లయితొలగించండి
  8. :) ఫొటోలు బాగున్నాయి. ఒక్కటే అనిపిస్తుంది. అన్ని అల్లం/మిర్చి/ఉల్లి ముక్కలూ మధ్యలో కాన్సెన్ ట్రేట్ అయిపోయినట్టున్నాయి. అన్ని వైపులా పరిస్తే.. ఇంకా బాగుంటుందేమో?

    రిప్లయితొలగించండి
  9. @కృష్ణప్రియగారు: ఒకసారి అలా అంతటా పరిస్తే తీసేటప్పుడు కష్టమయ్యిందండీ. అందుకే మధ్యనేవేశా.

    రిప్లయితొలగించండి
  10. బాగుందండి. మరి పెసరట్టు తోటి ఉప్మా కాంబినేషన్ అంటారుగా. అదికూడా పెట్టేస్తే అయిపోయేదిగా:)

    రిప్లయితొలగించండి
  11. జయగారు, పైన చెప్పినట్లు, నాకు బొ.ర.ఉప్మాకీ దూరం :-)
    స్వప్నగారు, వెంటనే బోస్టన్ రండీ, వేసిపెడతాను. అల్లప్పచ్చడి ఎన్ని రకాలుగా చేసినా బాగుంటుంది, వెంటనే చేయించుకోవడమేకాదు, నేర్చుకోండిగూడ.

    రిప్లయితొలగించండి
  12. abbo nenu elagu india lone unnanu kada ani boston rammantaara hamma flight tickets pampandi to and fro alage vachhi mi allam chutney thinestanu ;)

    mundu chepinchukunta, manaki mood mallinappudu eppudina manam kuda oka sari try chestamu sir.

    రిప్లయితొలగించండి
  13. బ్రాడీపేట అభిజాత్యం నశించాలి, మా రామన్న పేట్ ప్రత్యేక రాష్ట్రం కావాలే..
    కాకపొతే జే.బి. అబ్బాయా, నాకు ఈ పెసర అంటేనే పడదే...కానీ బ్రాడీపేటోల్లకి వ్యతిరేకంగా ఈ విషయంలో మాత్రం పూర్తి మద్దతు ప్రకటిస్తున్నా

    రిప్లయితొలగించండి
  14. తార: బ్రాడీపేట-రామన్నపేట: హహ్హహా. నాకు రెండుచోట్ల దోస్తులున్నారు, కావున నేను మాట్లాడను. పడకపోవడం అంటే నచ్చదనా, ఆరోగ్యరీత్యానా - అదే ఫుడ్ఎలర్జీ?

    పద్మార్పితగారు: భాస్కరుగారు నోరూరిస్తే ఆగలేక చేశామండీ. అయినా ఇవాళ వనభోజనాలనీ, కార్తీక పౌర్ణమనీ అందరూ తెగ రాసేసి, ఫోటోలు, స్లైడ్షోలు పెడుతున్నారు గదండీ, నాదెంత చెప్పండీ.

    రిప్లయితొలగించండి
  15. ప్రొద్దున్న ప్రొద్దున్నే మీ పోస్టే చూసాను..భలే ఆకలి వేసింది

    రిప్లయితొలగించండి
  16. మీరేనా...లొవెల్ లొ ఉండేది ???? లొవెల్ లొ ఎక్కడ అపార్ట్మేంట్

    రిప్లయితొలగించండి
  17. వా..............................!నాకు ఇక్కడ చక్కని పెసరట్టు దొరకడంలేదు.పిండి ఎలా రుబ్బాలి,అట్టు ఎలా పోయాలి,అయ్యాక ఎలా తీయాలి(తీసాక ఎలా తినాలి అనేది నాకు తెలుసు ),ఇవన్నీ వీడియో పోస్ట్ పెడితే నా లాంటి వాడికి కాస్తంత ఉపకారం చేసిన వాడవు అవుతావు.

    రిప్లయితొలగించండి
  18. @స్వప్నగారు: మీకు విమానం ఛార్జీలు పెట్టుకునేకన్న, కొరియరు చేయడం తేలికకదండీ. అయినా మీకు అన్నిచేసిపెట్టే అమ్మగారున్నారుగా, అమెరికాదాకా వచ్చే కష్టమెందుకండీ.

    @నేస్తంగారు: ఆకలివేసిందా - అయితే ఉలవచారు చేసేసి మాకుకూడా పంపించండీ.

    @మంచు: నేను మాల్డెనులో ఉంటానండీ. మీ న్యూ ఇంగ్లాండు చిత్రాలు చూసినపుడు అనుసున్నా, మీదీ ఈ ప్రాంతమేనని - మీది లోవెలా?

    @విశ్వనాథ్: పిండి మిక్సీలో రుబ్బవలెను, అట్టు గరిటతో పిండిని పెనంపై గుండ్రంగా తిప్పి వేయవలెను (మధురవాణిగారు చెప్పారు, అట్లకాడతో తీసి కంచంలో వేసుకొని.. ఆ తర్వాత నీకు తెలిసిందే.

    రిప్లయితొలగించండి
  19. హుమ్మ్. లోకో భిన్నరుచి: మీ రుచులు మీవే. కానీ, పెసలుకి, పెసరపప్పుకి రుచిలో కొద్దిగా తేడా వుంటుంది. కావున ఒక్క ఛాన్సు ఇచ్చిచూడచ్చేమో.

    రిప్లయితొలగించండి
  20. పెసలు నచ్చుతాయండోయ్, పెసర పప్పు నచ్చుతుంది, కానీ వచ్చిన గొడవల్లా, ఈ అట్టు దగ్గిరా, కానీ ఈ మధ్య కాలంలో ఎప్పుడూ పట్టుకోలేదు, ఈ సారి ఇంట్లో వేసినప్పుడు ప్రయత్నించి చూస్తాను.

    రిప్లయితొలగించండి
  21. ఏ బ్లారు చూసినా నోరూరించేస్తున్నారు ఈవేళ. అందులోనూ పెసరట్టు. ఫోటోలు బాగున్నాయి.

    రిప్లయితొలగించండి
  22. పెసలతో వేసి ఉండాల్సింది. ఏదేమైనా మన మగధీరుల పరువు నిలబెట్టారు. అభినందనలు!!

    రిప్లయితొలగించండి
  23. పెసరట్టు అల్లం పచ్చడి బాగున్నాయి . నాకూ ఉప్మా నచ్చదు :) ఈ సారి పెసల తో ప్రయత్నించండి . ఇంకా రుచిగా వుంటాయి .

    రిప్లయితొలగించండి
  24. @తార: ఈసారన్న మన ఆంధ్రా (తెలుగువాళ్ళ) పెసరట్టు మీకు నచ్చునని ఆశిస్తున్నా.

    @సునీతగారు:థాంక్సండీ. మీ వ్యాసాలన్నీ ఒకానొకపుడు ఆఫీసులో కూర్చొని చదివేశానండి. ఆఫీసుకావున వ్యాఖ్యలు పెట్టలేదు, క్షమించగలరు :-)

    @శిశిరగారు: థాంక్స్. ఏదో తీసిన పెసరట్లు, ఫొటోలు బాగొచ్చాయికదాని,భాస్కర్గారిని ఉడికిద్దామని పోస్ట్ పెట్టానండీ. ఈ బ్లాగుభోజనాల గురించి నాకుముందు తెలియదండీ.

    @కొత్తపాళీగారు, @మాలాకుమార్‌‌గారు: థాంక్సండీ. నేను పెసలతోనే చేశానండి, ముందు రోజు రాత్రి గుర్తుపెట్టుకొని మరీ నానబెట్టి, పొద్దునే మిక్సిలో రుబ్బి చేశానండీ.

    రిప్లయితొలగించండి
  25. మొన్నటి వరకూ అండి లొవెల్ .... ప్రస్తుతం కాదు.
    ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఉంటారా ???? అసలు పెసరట్టు కి అందం వచ్చేదే అది కదండి.

    సరే కానీ...మీరు కామెంట్స్ లొ లింక్ ఎలా పెడుతున్నారు?? (పైన మధురవాణి గారి బ్లాగ్ కి లింక్ పెట్టినట్టు)

    రిప్లయితొలగించండి
  26. బొ.ర. ఉప్మా చిన్నప్పుడు ఇష్టంగా కాకపోయినా తినేవాడిని. పెళ్ళిళ్ళో, వేడుకల్లో తినీ-తినీ ఇపుడిక సయించట్ల. మిగతా అన్నిరకాల ఉప్మాలు తినగలను.

    బ్లాగుస్పాట్ వ్యాఖ్య డబ్బాలో సాధారణంగా (డిఫాల్టుగా) <A>,<B>,<I> లని అనుమతిస్తారు. అవి వాడే లింకు పెడుతున్నానండి. వారు అనుమతించకపోతే లింకు మొత్తం ఇవ్వాల్సిందే.

    రిప్లయితొలగించండి
  27. ఉప్మా బానే వుంటుంది కాని, ఈ పెసరట్టు నాకు నచ్చని టిఫిన్లలో ఒకటి. పచ్చని జంతు చర్మంలా వుంటుందదేమి తిండో! ఈ ఆంధ్రోళ్ళు ఇలాంటి ఫుడ్లు తింటారేమిటబ్బా అని అపుడపుడనిపిస్తుంది. ఏదో సాటి తెలుగువాడిగా మొహమాటానికి తింటానే తప్ప పెసరట్టు గడ్డిలా వుంటుందంటాను, జె.బి గారు మొహమాటంగానైనా ఒప్పుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం వుంది, తప్పదు. :) మీరు మరీ మొహమాట పడితే, పైన విశ్వనాథ్ గారు మీతో ఇక్కడే పప్పు రుబ్బించే ప్రయత్నంలో వున్నారు, గమనించగలరు. :P

    రిప్లయితొలగించండి
  28. ఎస్‌‌ఎన్కేఆర్‌‌గారు, పోన్లేండి ఎవరి టేస్టు వారిది. ఇక్కడ అమెరికాలో పొద్దుపొద్దునే బ్రెడ్డుముక్కల మధ్యలో తియ్యని పాన్‌‌కేకులు పెట్టుకొని, దానిపై మళ్ళీ తియ్యని మేపుల్ సిరపు వేస్కొనేవారిని; పూనేలో పొద్దునే మిశాల్ పావ్(బూందీ మిక్చరు + బన్ను) తినేవారిని చూసీ ఎలా తింటారబ్బా అని నాకూ అనిపించింది.

    రిప్లయితొలగించండి
  29. అబ్బ ఉప్మా పెసరట్టు అదిరిపోయిందండీ, నాకైతే మహా ఇష్టం. అందులోనూ నెయ్యి వేసిన ఉప్మా, ఎర్రగా కాల్చిన పెసరట్టు, కమ్మని అల్లం పచ్చడి...అబ్బబ్బబ్బబ్బ, స్వర్గానికి బెత్తెడు దూరం కాదూ!

    కాకపోతే పెసరపప్పు కన్నా, పెసలుతో చేస్తేనే బావుంటుంది అట్టు.

    రిప్లయితొలగించండి
  30. @సౌమ్యగారూ, మీరు వ్యాసం + వ్యాఖ్యలు పూర్తిగా చదవలేదు, లేదా చిత్రము చూడలేదు :-) నేను పెసలతోనే చేశానండీ. నాకు ఉప్మాకి దూరం, దూరం, దూరం. ఖళ్..ఖళ్...ఖళ్... ఉప్మా పేరు తలుచుంటేనే ఏదో అవుతుంది.

    రిప్లయితొలగించండి
  31. Good.

    Please share recipe for allam pachadi. (in detail) Thanks in advance.

    Oka Brahmi.

    రిప్లయితొలగించండి
  32. అయ్యయ్యో ఎంతమాట! మీ వ్యాసం+వ్యాఖ్యలు అన్నీ చూసానండీ. పెసలుతో చేస్తేనే నాకూ ఇష్టం అని చెప్పడమే నా ఉద్దేసం.

    అదిగో మరి ఉప్మానేమైనా అంటేనే....నేనొప్పుకోను. ఉప్మా ఇష్టుల సంఘం వర్ధిల్లాలి. :)

    రిప్లయితొలగించండి
  33. జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఓట్లతో అట్లు వేయండి, ఉప్మాతో తింటే ఎలావుంటుందో!

    రిప్లయితొలగించండి
  34. @అజ్ఞాత: నేను చేసిన అల్లప్పచ్చడి గురించి త్వరలో పెడతాను. అసలు అల్లప్పచ్చడి ఎలా చేస్తారో మటుకు నన్నడగమాకు :-)

    @ఆ.సౌమ్యగారు: ఔచ్! నేనే మీ వ్యాఖ్య తప్పర్థంచేసుకున్నాన్నమాట.

    @అజ్ఞాత: ఆ ప్రయోగాలన్నీ వీలునిబట్టి చేద్దాంలే.

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in