నా కనులతో... అని ఒక కొత్త ఫోటోబ్లాగు ఆరంభించా. ఇది పెట్టాలా వద్దా అని ఒక రెణ్నల్లపైగా ఆలోచించా. ఎందుకంటే నాకు ఇప్పటికే ఒక ఫొటోబ్లాగు ఉంది. కానీ అందులో నేను తీసినవాటిలో అత్యుత్తమైనవి మాత్రమే పెడుతున్నా. మిగతావి నా కంప్యూటరులో మగ్గిపోతున్నాయి. అందులో ఒక తొంభై పూల చిత్రాలున్నాయి.
నా మొదటి బ్లాగుకున్న ఇంకో పరిమితి చిత్రం సైజ్. ప్రతి చిత్రాన్ని రీసైజ్ చేయాలంటే కష్టం. అదే బ్లాగుస్పాటుకైతే పికాసనుండి సీదా ఎక్కించచ్చు.
నా దృశ్యబ్లాగుని కూడ చూసి ఆనందించగలరు.
నా కనులతో...
కలగూరగంప లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కలగూరగంప లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
14, డిసెంబర్ 2010, మంగళవారం
21, నవంబర్ 2010, ఆదివారం
పెసరట్టు + అల్లప్పచ్చడి + బ్రూ కాఫీ
భాస్క్రర్ రామరాజుగారు వారాంతంలో ఉల్లిపెసర కుమ్మారంట, బొమ్మలు చూపించి నోరూరించారేగానీ ఎలా చెయ్యాలో చెప్పలా. అహా! నాకు రాదనికాదు, ఇంటర్నెట్లో దృశ్యాలు దొరకవనికాదు; తోటి గుంటూరువాడికి స్థానిక పద్ధతిలో చెప్తారని.
అందుకే, నేను ఇవాళ పొద్దునే (పదకొండుకి) లేచి చేసేశా. పనిలోపని అల్లప్పచ్చడి కూడా చేశా. పెసరట్లు కుమ్మాక చిక్కటి కాఫీ గొంతులో పడితేనేగా మజా. ఫిల్టరు కాఫీ లేదు, ఏం చేస్తాం, బ్రూ కాఫీతో సరిపుచ్చా.
బ్రహ్మచారి ఒక్కడే అమెరికాలో చీజ్ పిజ్జాలు- వెజ్ బర్గరులు తినలేక కష్టపడుతున్నాడని పాపం ఇంట్లోవాళ్ళు తల్లడిల్లుతుంటారు, మనం ఇక్కడ రోజూ కుమ్ముతున్నామని చెప్పినా నమ్మట్లా. అందుకే వాళ్ళకోసం, నోరూరించి నాలో పౌరుషం+పట్టుదల రగిలించిన భాస్కర్‌గారి కోసం ఈ క్రింది చిత్రము.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)