6, నవంబర్ 2011, ఆదివారం

మొగుడు - నా పాలిటి యముడు


నేను థియేటర్లో సినిమాలు తక్కువగా చూస్తాను. వెళ్ళినా, మిత్రుల-చుట్టాల బలవంతం తప్పితే నా అంతట నేను పనిగట్టుకొని  వెళ్ళేవి చాలా తక్కువ (ఇంతవరకు దూకుడు చూడలేదు). వెళ్ళినా ఒక్కడినీ‌వెళ్ళను. బాగోపోతే సెటైర్లు వేసుకోడానికి ఒక్కరన్నా ఉండాలని. వెళ్ళాను గాబట్టి, అపుడు నోటిదాక వచ్చినవి ఇపుడు వెళ్ళగక్కుతా. మామూలుగా సమీక్షలు రాయనివాడిని(ఎపుడన్నా ఒక లైను  ఫేస్బుక్ అభిప్రాయం తప్పితే), తప్పట్లేదు.

బండి సర్వీసింగుకిచ్చి ఎలా కాలక్షేపం చేద్దామా అని ఆలోచిస్తుంటే పక్కనే 'మొగుడు ' పోస్టర్ కనిపించింది. కృష్ణవంశీది గదాని హాల్లోకెళ్ళి  కూర్చున్నా. అతనికి అభిమానినికాకున్న అతని 'క్రియేటివిటీ' నచ్చుతుంది, ఇప్పటి దర్శకుల్లో అతను చాలా నయమని నా‌అభిప్రాయం. అయినా మధ్యమధ్యన అరుపులు, అనవసరపు లాగుడు ఉంటాయని అంత:పురం తర్వాత అతని సినిమా ఏదీ హాలుకెళ్ళి చూడలేదు. కానీ ఈసారి తప్పలేదు.

సినిమా కథగురించి రాయనుగానీ కొన్ని అంశాలు చాలా నిరాశపరిచాయి -

- సమాధుల దగ్గర శాస్రీయ కూచిపూడి నృత్య ప్రదర్శన ఏంటో?
- టీనేజి అమ్మాయిలమీద చక్కగా తీసిన డయిరీమిల్క్ ప్రకటన విషయాన్ని ఏమాత్రం నప్పని కూచిపూడి అలంకరణలో ఉన్న తాప్సీతో కాపీకొట్టడం ఏంటో?
- కుటుంబ కథాచిత్రమని ప్రచారం చేసుకుంటూ, యూ సర్టిఫికేటిచ్చిన చిత్రంలో ప్రతి పదినిమిషాలకి సెన్సార్ కత్తెరకి సంభాషణలు మూగబోవడం ఏంటో? ఆ మూకీ సంభాషణలకి తెరపైన అందరూ నవ్వుకుంటుంటే మేము (పక్కన కూర్చున్న దూకుడు దొరకని ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు) విరక్తిగా నవ్వుకోవడం ఏంటో?
- తాప్సీ పాత్రని  చూస్తే  కృష్ణవంశీ శశిరేఖ పరిణయం సీక్వెల్ తీశాడా అనిపించింది -అదే మూర్ఖత్వం, అదే మొండితనం, అవే ఏడుపులు, అవే అరుపులు, వగైరా, వగైరా.
- తాప్సీ నటన కూడ జెనీలియాని పదేపదే గుర్తుకు తెచ్చింది.
- డబ్బులన్నీ రాజేంద్రప్రసాదువిగ్గుకి అయిపోవడంతో రోజా మొహానికి రంగులేసినట్లు లేరు, నల్లగా నిగనిగలాడింది. కానీ సహజంగా లేదు.

సరే నచ్చిన విషయాలకొస్తే
- సొంతంగా డబ్బింగు చెప్పుకొనడం అభినందనీయం, సరిత-సవిత-సునీత-చిన్మయి వంటి నస గొంతులనుండి విముక్తి. కానీ కొంచెం దగ్గరుండి డబ్బింగు చెప్పించుకోవాల్సింది.
- నేపథ్య సంగీతం (రీరికార్డింగు) అధ్బుతం - చాలా కాలంతర్వాత ఇందులో‌ఆస్వాదించాను.

శశిరేఖా పరిణయం నిరాశ పరిచినా కృష్ణవంశీ కి ఇంకో అవకాశమిద్దామనుకున్నా. ఈ చిత్రంతో అతనిని ఈ క్రింది దర్శకుల చిట్టాలో చేరుస్తున్నా -

బాలచందర్  - పరవశం, అబధ్దం
 వంశీ - దొంగరాముడు & పార్టీ, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తాను
 విశ్వనాథ్ - ఆపద్బాంధవుడు, శుభసంకల్పం
రామ్‌గోపాల్‌వర్మ - రామ్‌గోపాల్‌వర్మకీ ఆగ్, రక్తచరిత్ర
బాపు - రాధాగోపాళం
కృష్ణవంశీ - శశిరేఖా పరిణయం, మొగుడు.

ఈ చిట్టా ఏంటని ఇంకా ఆలోచిస్తున్నారా - ఎన్నో‌ గొప్ప చిత్రాలు తీసినవారి తిరోగమనం ఇలాగే మొదలైంది.ఇపుడు వారి కొత్త సినిమాలు చూడాలంటే కొంచెం, కాదు చాలా‌భయంవేస్తుంది. మధ్యమధ్యన వారి చమక్కులున్నా, మొత్తం మూడు గంటలు వారి కళాఖండాలని హాల్లో చూసే ఓపిక ఇంక నాకులేదు.

**** ౬-౧౧ నాడు‌ కలిపిన ది****




ఇవాళ‌ వాచ్‌మన్‌ మేనల్లుడు‌ లిఫ్ట్‌ అడిగితే బండెక్కించుకున్నా. 'మొగుడు‌' హాలుముందునుండీ‌ వెళ్ళుతుంటే మీరు‌ సినిమాలు‌ చూడరా అన్నా? అని‌ అడిగాడు‌.

ఎందుకు‌ చూడం నాయనా, ఈ 'మొగుడు‌' మొన్ననే బాదించుకున్నాగా అన్నా.

'నేనూ చూశానన్నా, మూడు‌ సార్లు‌'
'అవునా!!!!'
'అవునన్నా! గోపీచంద్‌ ఫ్యానుని‌'
నడుపుతున్న‌ బండీ అప్పటికే‌ అటూఇటూ ఊగుతుంది‌.
'నేను‌ కృష్ణవంశీ అభిమానినిలే'
'హిహ్హీహీ! మొన్న‌ హాల్లో ముందు‌ సీటోడు‌ కృష్ణవంశీ ఫ్యానంటే‌ నవ్వొచ్చింది‌, వాడికీ ఫ్యానులుంటారా' అ.ని

వెంటనే బండి‌ ఆపి‌ వాడిని‌ దిగమన్నా.




*వంశీకి కొంచెం మినహాయింపు. అతని సినిమాలు టీవీలో వచ్చేదాక ఆగలేను.*





16 కామెంట్‌లు:

  1. aapadbhandavudu yee list lo yendukunde vivarinchandi konchem mastaru

    రిప్లయితొలగించండి
  2. దర్శకుడిగా విశ్వనాథ్‌గారి పతనం ఆ సినిమాతో మొదలైంది. ఆ సినిమాలో మెలోడ్రామా, అనవసరపు సోది ఎక్కవై ఆయన టచ్ తగ్గింది. మొత్తం మీద థియేటర్లో (అప్పటికింకా పిల్లాడినేలేండి) తలనెప్పి వచ్చింది

    రిప్లయితొలగించండి
  3. అందరివీ చెత్త సినిమాలిచ్చి విశ్వనాదవారివి మాత్రం "వీటితో మొదలయ్యింది" అంటూ ఆరెండూ ఇచ్చారే? "స్వరాభిషేకం" చూశారా? ఆ కధ, ఆ పాత్రల నటన ఆహా... దారుణమైన టార్చరది. బాపూగారిది "సుందర కాండ" మర్చిపోయినట్లున్నారు.

    డబ్బింగుల విషయంలో నాదీ అదే అభిప్రాయం. ఒకప్పుడు మిమిక్రీ ఆర్టిస్టులందరూ నాగార్జున లోబీపీ పేషెంట్‌లాగా మాట్లాడుతాడు అని సెటైర్లు వేసేవారు. ఇప్పుడు అంతకంటే దారుణంగా వుంటున్నాయి హీరోయిన్ల గొంతులు. ముఖ్యంగా ఆ సమంత అనగా చిన్మయి.

    రిప్లయితొలగించండి
  4. హ హ మీరు కూడా బలి అయ్యారా ఈ సినిమా కి :)))

    రిప్లయితొలగించండి
  5. >>>ప్రతి పదినిమిషాలకి సెన్సార్ కత్తెరకి సంభాషణలు మూగబోవడం

    అవునా. అయితే టైటిల్ సాంగ్ మొత్తం మూగబోయుండాలే!!! పరిస్థితుల ప్రభావం వల్లనైనా సినిమా మొత్తం చూడగలిగిన మీ సహనానికి జోహార్లు. నేను టైటిల్ సాంగ్ వినే రిటైర్డ్ హర్ట్ అయిపోయాను.

    రిప్లయితొలగించండి
  6. :) బాగుంది. సెలవ కదా వెళ్దాం అని అనుకున్నాం ఈ పూట!

    ఇంకా మీ ఇద్దరి (మీ, రాజ్ కుమార్) రివ్యూలు చదవకపోతే మేమూ బక్రీద్ పూట బలైపోయేవాళ్లం

    రిప్లయితొలగించండి
  7. మీ రివ్యూ రాజ్ కుమార్ రివ్యూ చూసిన తరువాత, ఆ సినిమా ఆడుతున్న హాల్ కి ఆమడ దూరం లో ఉండాలని నిర్ణయించుకున్నాను.

    రిప్లయితొలగించండి
  8. @Indian Minerva: వాటితో మొదలయింది కాబట్టే చెప్పానండి, ఆ తర్వాతవి‌ ఎందుకులేండి‌. 'సుందరకాండ‌' - నిన్న‌ ఎంత‌ గింజుకున్నా ఇది‌ గుర్తుకురాలేదు‌, థాంక్స్‌.

    @ Sravya Vattikutiగారు: తెలిసీ వేయించుకోవడం అంటే అదే మరీ :-)

    రిప్లయితొలగించండి
  9. @శిశిరగారు‌: ఈ మధ్యకాలంలో‌పాటలు‌ కత్తిరించడం చూడలేదండీ, అయినా పాటలో‌మాటవినిపిస్తే కదా, బూతుగురించి‌ ఆలోచించడానికి‌. నాకు‌ ఆ మాత్రం సహనం ఉందిలేండీ - ఇంకా మహత్తర‌ సినిమాలు‌ చూశాను‌.

    @కృష్ణప్రియగారు‌, @బులుసుగారు‌: నా ఆవేదన‌ మీకు‌ వేదన‌ తగ్గించినందుకు‌ సంతోషంగా ఉంది‌.

    రిప్లయితొలగించండి
  10. హ..హ..మేం తృటిలో తప్పించుకుని పిల్ల జమిందార్ చూసొచ్చాం . బక్రీద్ మాకు బాగా కలిసొచ్చిందన్నమాట

    రిప్లయితొలగించండి
  11. విశ్వనాథ్ - ఆపద్బాంధవుడు, శుభసంకల్పం
    ఇది నేను ఖండిస్తున్నానండీ.. ;) ;)

    మిగిలిన ప్రతీ పాయింటుకీ బింగో బింగో.. ;)
    కృష్ణవంశీకి బోలెడు మంది అభిమానులండీ (నేనూ ఉన్నా;)). కాకపోతే కొన్నాళ్ళ తర్వత "ఒకప్పుడు కృష్ణవంశీకి కూడా అభిమానులు ఉండేవారూ" అని చెప్పుకోవల్సి వచ్చేలాగ ఉంది ;). మీకు నా సానుభూతి తెలియజేస్తున్నా ;)

    రిప్లయితొలగించండి
  12. అమ్మో, ఒకదాన్ని మించి మరొకటి గా ఉన్న ఈ రివ్యూలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాకు. ఎందుకంటే మేము హాల్ లో తెలుగు సినిమాలు చూడడం మానేసి చాలా ఏళ్ళయింది. ఈ మధ్యన రాజీవ్ మసంద్ అలాంటివాల్ల ఉత్సాహం చూసి దూకుడు చూసినందుకే ఇంకా బాధ పడుతున్నాం మరి.. మీ రివ్యూ బాగుంది..

    రిప్లయితొలగించండి
  13. అమ్మో సినిమా పేరు చెప్తేనే చిరాగ్గా ఉంది...భరించినందుకు మీకు హ్యాట్సాఫ్
    ennela

    రిప్లయితొలగించండి
  14. ఒకప్పుడు తెలుగు సినిమాలో అసభ్యతకు తావులేదు.
    ఇప్పుడు సినిమానిండా అసభ్యతయే.
    కధని మించిపోయి యెదిగిన యీ అసభ్యతా వైరస్ యిప్పుడు సినిమా పేర్లకు కూడా తగిలింది. నేడు సినిమా పేర్లు కూడా అసభ్యంగా పెడుతున్నారు.
    ముందుముందు యింకా యేమేమి రకాల అసభ్యతను చూస్తామో కదా!

    రిప్లయితొలగించండి
  15. కొత్తగా చేరాను ....హాజరు వెయ్యరు....???/http://raafsun1986.blogspot.com/2011/11/blog-post.html

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in