3, జూన్ 2021, గురువారం

పింగళివారి పేకి

 పింగళివారి పేకి

పింగళి సూరన గొప్ప తెలుగు కవి. అష్ట దిగ్గజాలలో ఒకరు.

ఒక రోజు సూరన అడవిలోంచి ఇంటికి వెళ్తుండగా దారిలో ఒక మణి దొరుకుతుంది. ఇదేదో మెరుస్తుంది కదాని తీసుకుంటాడు. ఇంటికి చేరేసరికి, గుమ్మం ముందర ఒక అమ్మాయి ఎవరికోసమో ఎదురు చూస్తూ నిలబడి కనిపిస్తుంది.

”ఏమమ్మా నీకేం కావాలి?” అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి ”నా పేరు పేకి అండి.  నాకు పని కావాలి. ఇంటి పని బాగా చేస్తాను.” అని అడుగుతుంది.

”జీతం ఎంత కావాలి?” అంటే ”జీతం ఏమి వద్దండి. కాకపోతే నాకు 24 గంటల పని ఇవ్వాలి. ఎప్పుడైతే మీరు నాకు పని ఇవ్వలేరు. అప్పుడు నేను మానేసి వెళ్ళిపోతాను” అంటుంది.

సూరన్న, అతని భార్య కూడా ఒక పని మనిషి కావాలని ఎప్పటినుంచో వెతుకుచున్నారు కాబట్టి సంతోషంగా ఒప్పుకున్నారు.

అయితే ఈ పేకి ఏ పని ఇచ్చినా చిటికెలో చేసేది. ”మళ్లీ పని కావాలి” ”పని ఇవ్వండి ఇవ్వండి”  అని అడిగేది. మొదట్లో సూరన్న, గర్భవతి అయిన అతని భార్యకి సంతోషంగా ఉన్నా ఇంట్లో పనులన్నీ అయిపోతున్నాయి. నెమ్మదిగా విసుగు రాసాగింది. ఏ పని చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఎంత కష్టమైన పని చెప్పినా చేసేది.

ఇంతలో సూరన్న భార్యకి పాప పుట్టింది. పేకి సూరన్న భార్యకి తోడుగా అదే గదిలో పడుకునేది. ఒక రోజు రాత్రి సూరన్న భార్యకు మెలకువ వచ్చింది. నూనె దీపం ఆరిపోతున్నదని (అప్పట్లో కరెంటు లేదు) గమనించి పేకి ని ఒత్తిని కొంచెం పైకి జరపమని చెబుతుంది. అయితే ఆ పేకి బద్దకమై లేవలేక నాలుకని బాగా దీపందాకా జాపి పడుకున్న చోటినుంచే వత్తిని జరుపుతుంది. దెబ్బకు సూరన్న భార్యకు భయమేస్తుంది, ఈ పేకి మనిషి కాదు దయ్యము అని తెలుస్తుంది.

మరుసటి రోజు పొద్దున్నే సూరన్న భార్య భర్తకు ఈ విషయం చెప్పింది. ఎలాగైనా ఈ పైకి నుంచి తప్పించుకోవాలని ఉపాయం పన్నుతాడు. 

ఒకరోజు పేకిని నదికి నీరు తెమ్మని పంపించి సూరన్న కుటుంబంతో సహా ఇల్లు మారి వేరే ఊరు వెళ్ళిపోతాడు. తిరిగొచ్చిన పేకి చూసేసరికి ఇంట్లో ఎవరూ ఉండరు. ఇరుగుపొరుగు వారిని అడిగితే వాళ్ళు ఇలా సూరన్న వాళ్ళు పక్క ఊరికి మారిపోయారని చెబుతారు. అప్పుడు పేకి అక్కడ ఒక రుబ్బు రోలును చూస్తుంది. అయ్యో! నా యజమాని రోలు మర్చిపోయాడే అని ఆ రోలును పట్టుకొని వారు మారిన కొత్త ఇంటికి వెళ్తుంది.

కొత్త ఇంటి దగ్గర అంత పెద్ద రోలును తల మీద పెట్టుకొని అంత దూరం నడిచి వచ్చిన పేకి ని చూసి సూరన్న అతని భార్య ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా దయ్యమే మనిషి కాదు అని  ఖాయం చేసుకుంటారు.

”అసలు నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు?” అని అడుగుతారు. నేను నా మణి కోసం వచ్చాను అది ఇస్తే వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు మణిని దానికి ఇచ్చేస్తాడు, పేకి వెళ్ళిపోతుంది.

మా నాన్నగారు ఇందులో రెండో క్లైమాక్స్ కూడా చెప్పేవారు. 

సూరన భార్యకు ఒక ఉపాయం తట్టింది. పేకి ని తన తలని దువ్వమని చెప్తుంది. తల దువ్వి జడ వేశాక కింద పడిన వెంట్రుకలన్నీ చిన్న ఉండ చుట్టిస్తుంది. సూరన భార్య పేకితో ఆ ఉండను తుంగభద్రా నది తీసుకువెళ్లి చింతపండు తోమి, మొత్తం చుట్టలు లేకుండా వంకర తిరక్కుండా సన్న తీగలాగా చేసి తీసుకొని పంపిస్తుంది. టేకి నదికి వెళ్లి ఆ ఉండలోని వెంట్రుకలను చింతపండు తోమి వంకర తీసి తీగలాగా చేయటానికి కొన్ని రోజుల పాటు ప్రయత్నిస్తుంది. ఇది జరిగే పని కాదని తెలుసుకుని, అప్పజెప్పిన పని చేయలేదు కావున మళ్లీ సూరన ఇంటికి తిరిగి రాకుండా వచ్చిన అడవికి వెళ్ళి పోతుంది.

2, జూన్ 2021, బుధవారం

నా టెక్నాలజీ - డొమైను అనుభవాలు

 మొన్న ”ఒక టెక్నాలజీ వేరు వేరు డొమైన్ లేదా ఒకే డొమైన్ వేరు వేరు టెక్నాలజీలు వీటిలో ఏది సరైనది” అని ఎవరో అడిగితే నేను నాకు తెలిసింది చెప్పాను. అదే దీనికి ముందరి పోస్టు.

అయితే ఇలాంటివి సమాధానం చెప్పేటప్పుడు నా అనుభవాలు ఏంటి, నేను ఏం చేశాను చెప్పడం నాకున్న చెడ్డ అలవాటు. ఇందులో నాకున్న రెండు ఉద్దేశ్యాలు - ఒకటి సలహా ఇవ్వడానికి నాకు కొంచమైనా అర్హత ఉందని చెప్పుకోవడానికి, రెండు నేను చేసిన తప్పులు ఏమన్నా ఉంటే చేయకుండా. నా పాత కోరా సమాధానాలలో గమనించవచ్చును. 

కానీ పాపం అడిగినవారు వారికేది మంచిదో సలహా కావాలని అడిగితే, నేనేమో అహనా పెళ్ళంటలో నూతనప్రసాదులా సొంత సుత్తి వేసుకుంటూ పోతా, మధ్యమధ్యన చూపులు కలిసిన శుభవేళలో నూతనప్రసాదులా అడ్డమైన పోలికలు (అనాలజీ) ఇచ్చుకుంటూ. అందుకే ఈ సారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని అలా వివరించాను.


మరి నా 17 ఏళ్ళ టెక్నాలజీ అనుభవాలు ఎక్కడన్న చెప్పాలిగా - ఇక్కడ పెడుతున్నా.

కాలేజీలో (1999-2003) ఉన్న రోజుల్లో మాకు విజువల్ బేసిక్, విజువల్ సీ++ మాత్రమే ఉండేవి. డాట్‌నెట్ 1.0 ఇంకా అంత ప్రాచుర్యం పొందలేదు. ఒక మిత్రుడు హైదరాబాదు నుండి మైక్రోసాఫ్టు ప్రెస్ పుస్తకం తీసుకువస్తే ఇద్దరం డాట్‌నెట్ 1.0 (విజువల్ స్టూడియో 2002) కొంచం నేర్చుకున్నాం.  

2004లో ఉద్యోగంలో చేరాక నా మొదటి ప్రాజక్టులో డాట్‌నెట్ 1.0 (విజువల్ స్టూడియో 2002) , డాట్‌నెట్ 1.1 (విజువల్ స్టూడియో 2003) మీద పని చేశా. ఇందులో కంటెంటు మేనేజిమెంటు కూడా ఉంది. ఆ ప్రాజక్టు ఒక అమెరికా టాప్ 1 మ్యూచువల్ ఫండ్స్ కంపెనీకి వెబ్సైటు. ఊరికి పోయి ఫ్రెండ్సుకి, నాన్నకి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరరులో వెబ్సైటు తెరిచి మనం డెవలప్ చేసిన వెబ్‌పేజీలు చూపించడం (2004లో) - ఆ అనుభవం నభూతో నభవిష్యత్. ఈ ప్రాజక్టుకోసం AMFI (Association of Mutual Funds in India ) సర్టిఫికేషను చేశాను.

2005లో డాట్‌నెట్ 2.0 (విజువల్ స్టూడియో 2005)లో ఒక అమెరికా టాప్ 3 బ్రోకరేజి సంస్థకు ఒక పేమెంటు సిస్టం  ప్రాజక్టుపని చేశా. ఇక్కడ SQL Server 2000 ఉంది.

2007లో ఒక అమెరికా టాప్ 3 ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు సంస్థకు రెండు మూడు రిపోర్టింగు అప్లికేషన్లు తయారు చేశాం. ఇందులో Oracle 10g డేటాబేస్.

2008లో అదే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు సంస్థకు ఒక డాట్‌నెట్ అప్లికేషన్ (డాట్‌నెట్ 2.0 (విజువల్ స్టూడియో 2005), క్లాసిక్ ఏఎస్‌పీ, సైబేస్) సపోర్టు, ఎన్హాన్స్‌మెంట్లు చేశాము. ఈ అప్లికేషనును ఆ సంస్థ సబ్సిడియరీలు అయిన ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, బ్రోకరేజి, పర్సనల్ ఇన్వెస్టింగు, బిజినెస్ ఇన్వెస్టింగు, ఇంకా చాలామంది వాడేవారు. ఈ అప్లికేషను రిపోర్టులు ఆ సబ్సిడియరీల CxOలు, ప్రెసిడెంట్లు వాడేవారు.  దీనికోసం నేను అమెరికా వెళ్ళాను. అప్పుడప్పుడు వారితో మాట్లాడేవాడిని. రెండు మూడు సార్లు వారి ట్రేడింగు ఫ్లోరుకి కూడా వెళ్ళాను రిక్వైరుమెంట్లు తీసుకోవడానికి. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, ట్రేడింగు గురించి చాలా నేర్చుకున్నా.

2010-12 ల మధ్యన GRC (Governance, Risk & Compliance) లో ఒక ప్రోడక్టుకు సపోర్టు, కష్టమైజేషన్ చేశా. డాట్‌నెట్ 2.0 (విజువల్ స్టూడియో 2005) డాట్‌నెట్ 3.5 (విజువల్ స్టూడియో 2008), సైబేస్, ఓరకిల్, SQL సర్వరు, డాక్యుమెంటం - ఇలా అన్నీ ఉన్నాయి. ఇందులో రిస్కు ప్రొసీడ్యరు, పాలసీలు, కంప్లయన్సు ఎందుకు, మనీ లాండరింగు (AML), ఇలా చాలా తెలుసుకున్నా.

2013-14 ల మధ్యన ఒక పెద్ద అమెరికా బ్యాంకుకు చెందిన ఒక ఇన్సూరెన్స్ సబ్సిడియరీకి ఒక ఇన్సూరెన్స్ ట్రాకింగు అప్లికేషనుకు టెక్నికల్ మేనేజరుగా చేశా. అమెరికాలో హోం లోను తీసుకునే ప్రతి ఇంటికి బీమా తప్పనిసరి. కానీ చాలా మంది రెండవ సంవత్సరం నుండి బీమా  ఎగ్గొడతారు. మా అప్లికేషను రోజూ బ్యాంకులనుండి కొన్ని లక్షల లోను డేటా, బీమా సంస్థలనుండి లక్షల బీమా డేటా తెచ్చి ట్యాలి చేస్తుంది. తేడాలున్నవారికి ఫోన్లు చేయడం, లెటర్లు పంపించడం చేసి బలవంతాన బీమా అంటగడతారు. డాట్‌నెట్ 3.5, 4.x (విజువల్ స్టూడియో 2008, 2010, 2012) వాడేవారం. సపోర్టు, మైనరు  ఎన్హాన్సుమెంట్లు, ఫుల్ ఫ్రం స్క్రాచ్ డెవలప్మెంటు ఉండేది. నాకు 45 మంది రిపోర్టు చేసేవారు.

ఆ ప్రాజక్టు మేనేజ్మంటు విసుగుపుట్టిన సమయంలో 2014లో అమెరికాలో టాప్ బీమా సంస్థకి ఆర్కిటక్టుగా ప్రాజక్టు వచ్చింది. ఇది మామూలు వ్యక్తిగత, ఆస్తి (Property & Casualty) బీమా కాదు, వాహన (Auto) బీమా కాదు. స్పెషాలిటీ బీమా - అంటే ఒక కంపెనీ డైరెక్టర్లు, సీఈఓలు కిడ్నాపుకు గురయితే? ఒక వైద్యుడిపై ఎవరన్నా కేసు పెడితే? ఒక ఆర్టిస్టుపై కాపీరైటు కేసు వస్తే? ఐడీ ఫ్రాడు? ఇలాంటివాటికి బీమా ఇస్తుంది మా క్లయింటు. వైవిధ్యమైన టెక్నాలజీలున్న చాలా అప్లికేషన్లున్నాయి. అన్నింటినీ ఎసెస్ చేసి, వాటిని క్లౌడు (PCF, AWS, Azure) , Containerization (Docker) లలోకి మార్చడానికి స్ట్రాటజీ, ఆర్కిటెక్చరు చేశాము.  డాట్‌నెట్‌ 4.x, కోర్ (విజువల్ స్టూడియో 2015, 2017, 2019) వాడాను.

2020లో ఒక చిన్న సంస్థకి (టైటానిక్ నుంచి లాంచీకి) మారాను. ఇక్కడ 5-6 డొమైన్ల క్లయింట్లకు సంబంధించిన ప్రాజక్టులు సమీక్ష చేశాను, 2-3 క్లయింట్లు ఇచ్చారు. 

2021లో  ఫార్మాసీలకు ప్రొడక్టు తయారు చేసే ఒక అమెరికా కంపెనీలో చేరాను. హెల్త్‌కేరు, ఫార్మా డొమైను  గురించి నేర్చుకుంటున్నా.

అలా బ్యాంకింగు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టింగు, రిస్కు, గవర్నన్సు, కంప్లయన్సు, బ్రోకరేజి, ఇన్సూరెన్స్ ట్రాకింగు, స్పెషాలిటీ బీమా, ఇన్సూరెన్సు,హెల్త్‌కేరు, ఫార్మా డొమైన్లలో పని చేశాను, నేర్చుకున్నా.

క్లాసిక్ ASP, VB6, .Net 1.0, 1.1, 2.0, 3.5, 4 to .Net 4.x & Core - VS, VS Interdev to VS 2002, 2003, 2005, 2008, 2010, 2013, 2015, 2017, 2019, 2020, Visual Code, AWS, Azure, PCF, Kubernetes - ఇలా పేరుకు డాట్‌నెట్‌ అయినా 17 ఏళ్ళుగా చాలా వర్షన్లు నేర్చుకోవాలిసి వచ్చింది.

కానీ ప్రోగ్రామింగు, కోడింగు, ఎనాలిసిస్ మారవు. కేవలం సింటాక్సులు, టూల్స్ మారుతాయి.   

30, మే 2021, ఆదివారం

ఐటీ ఫీల్డ్లో డొమైన్ ఎంచిక ఎలా? ఒక టెక్నాలజీ వేరు వేరు డొమైన్ లేదా ఒకే డొమైన్ వేరు వేరు టెక్నాలజీలు వీటిలో ఏది సరైనది?

1. పండగ రద్దీ సమయాల్లో హైదరాబాదు విజయవా‌డ మధ్యన ప్రత్యేక సర్వీసులుగా సిటీ బస్సులు వేస్తారు ఎపుడైనా ఎక్కారా? ఒకసారి స్వతంత్రం వచ్చి ఎక్సిలరేటరు తొక్కేస్తారు. కానీ హైవే మీద వాళ్ళ అనుభవలేమి తెలిసిపోతుంది. 
2. లారీ తోలే వ్యక్తి కారు నడిపితే ఎపుడన్నా గమనించారా? 
3. మామూలు 800 కారు నడిపే వ్యక్తికి బీఎండబ్ల్యూ ఇస్తే ఊపిరి సినిమాలో కార్తీకి, లేదా పారసైటు సినిమాలో పేద తండ్రికి 
4. 15-20 ఏళ్ళ కిందటా, మీ ఊరులో రహదారులుగానీ, గమనిస్తే - అవే రహదారులుగానీ రద్దీ పెరిగిపోయింది, సైకిళ్ళు-రిక్షాలు కనుమరుగు అయ్యాయి. 

1, ఫిబ్రవరి 2021, సోమవారం

మనసును కదిలించిన పాటలు

 విన్నపము- మీరు సున్నిత మనస్కులు(వీక్ హార్టెడ్) అయినట్లైతే ఈ పోస్టు చదవద్దు, పాట వీడియో చూడద్దు - ఆడియో సాహిత్యం వరకు వినండి.

నాకు ఎమోషన్సు తక్కువ - ఉప్పొంగడాలూ-కుంగిపోవడాలూ రెండూ లేవు. చాలా గట్టి హృదయం నాది.

అలాంటి నా మనసును కదిలించిన, కుదిపేసిన పాట ఒకటుంది - భిక్షాందేహని వేడుతున్నా అని నేను దేవుడిని చిత్రంలోని ఇళయరాజా ఎప్పటిలాగే అద్భుతంగా స్వరపరిచి, మధు బాలకృష్ణన్ ఆర్ద్రతతో పాడి, అంతే సహజంగా హృద్యంగా దర్శకుడు బాల చిత్రీకరించిన పాట. తెలుగులో వనమాలి చాలా అర్థముతో వ్రాశారు.

నాకు నందా, పితామగన్ (శివపుత్రుడు) సినిమాల నుంచి బాల దర్శకత్వం నచ్చేది. 2009లో నేను అమెరికాలో ఉన్నప్పుడు ఈ నేను దేవుడిని తమిళ మాతృక నాన్ కడవుల్ వచ్చింది. అఘోరాల సినిమా అని ఆసక్తిగా చూడడం మొదలుపెట్టా. కాశీలో హీరో ఆర్య అఘోరగా బాగానే మొదలైంది - ఆ శవాలు కాల్చడం అవీ.

అసలు కథ తమిళనాడుకి హీరో సొంత ఊరికి వచ్చాక - అక్కడి గుడి దగ్గర ఒక బిచ్చగాళ్ల మాఫియా చిన్న పిల్లలను, అనాథలను బలవంతంగా బిచ్చమెత్తిస్తుంటారు. ఆ నేపథ్యంలో ఈ పాట వస్తుంది.

సినిమాలో ఈ పాట రాగానే నన్ను కుదిపేసింది. ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది. పాట మళ్ళీ మళ్ళీ చూశాను. శివపుత్రుడులో ఇలాగే శ్మశాన నేపథ్యంలో ఇళయరాజా అద్భుతమైన పాట (ఒకటే జననం ఒకటే మరణం ) నాకు నచ్చి అప్పటికి నా ఫోన్లో (2006లోనే నా దగ్గర MP3 పాటలు వినిపించే మొబైల్ ఉండేదిhttp://jb-jeevanayanam.blogspot.com/2010/06/2.html ) అరుగుతున్నా, ఈ పాటంతగా నన్ను వెంటాడలేదు.

తరువాత తెలుగులో డబ్బింగు అయ్యాక, సాహిత్యం కూడ నచ్చింది.

మనం జీవితాన్ని ఎంత టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకుంటామో ఈ పాట చూసినపుడల్లా విన్నపుడల్లా కలుక్కుమని గుర్తు చేస్తుంటూంది.

నాకు ఈ పంక్తులు బాగా తగులుకొని మదిలో ఎపుడూ మెదులుతుంటాయి, నాకు దైవంపై నమ్మకం లేకపోయినా -

రక్తం మాంసం ఎముకలు మలముతో

మలచిన దేహపు జోలెలతో...

***

మన్నుకు మరలిడు దేహమే

మరబొమ్మని తెలియక మర్మమునెరియగ

***

ఇది వలయా నీమాయా
మనిషిని నీవలే మార్చవయా
సిరులను వెతకగ తనువును స్వార్థము తరిమెనా.


భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే…పూర్తి సాహిత్యం -

భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే…
రక్తం మాంసం ఎముకలు మలముతో
మలచిన దేహపు జోలెలతో...
భిక్షాందేహని వేడుతున్నాచెంతనే నీ చెంతనే
రక్తం మాంసం ఎముకలు మలముతో
మలచిన దేహపు జోలెలతో...
భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే
శాపము తీరని విషమా
గత జన్మల కర్మల దోషమా
శాపము తీరని విషమా
గత జన్మల కర్మల దోషమా
మన్నుకు మరలిడు దేహమే...
మన్నుకు మరలిడు దేహమే
మరబొమ్మని తెలియక మర్మమునెరియగ
భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే
భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే
సంపదలున్నవి నీదరిలో చెయ్యి చాపేది వేడుక అందరిలో
సంపదలున్నవి నీదరిలో చెయ్యి చాపేది వేడుక అందరిలో
సుడిగాలిలో దీపమే మాబ్రతుకే
నడిపించక మానవు ఆ చితికే
ఒకపరియా మరిమరియా
జన్మలు ఎన్నని తెలుపవయా.
ఇది వలయా నీమాయా
మనిషిని నీవలే మార్చవయా
సిరులను వెతకగ తనువును స్వార్థము తరిమెనా.
నీ కరుణకు నోచని మనసున అలజడి రేగెనా...
దయగనరా దేవరా
దయచేసీ కావరా.
మా మొరలని వినమని వెతలను కనమని.
భిక్షాందేహని వేడుతున్నాచెంతనే నీ చెంతనే
రక్తం మాంసం ఎముకలు మలముతో
మలచిన దేహపు జోలెలతో...
భిక్షాందేహని వేడుతున్నా చెంతనే నీ చెంతనే...


ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా
బ్రతుకే గగనం ఇది నీ పయనం తెలుసా మనసా
ఒకటే జననం ఒకటే మరణం తెలుసా నలుసా
పయనం ముగియు ఈ చోటే కన్ను తెరిచావే
ఉదయం పంచు వెలుగుల్లో నిన్ను తెలిపావే
తోడు ఎవరులేక పుడమి ఒడి చేరినావే
ఎంత తెగువ తోటి ఈ వరము కోరినావే
తోటలో విరబూసిన అది మాలగా అలరించినా
పూలనీ అవి పూవులే తమ పేరునే అవి మార్చునా
పూరిగుడిసెలైనా పసిడి మేడలైనా నిన్ను మార్చునా
చివరి యాత్రలన్నీ కదిలే నిన్నుచేరుకోగా
చితిని పేర్చుతుంటే అన్ని నీకొక్కటేగా
పుడమిలో శ్రీమంతులు తమ పదవిలో పలు నేతలు
చెరగనీ తలరాతలు ఘనకీర్తులు నిరుపేదలు
భేదమెంత వున్నా బుగ్గిపాలు చేసే కర్మయోగివే