25, మే 2020, సోమవారం

ఫుడీ

ఫుడీ (foodie) అంటే ఆహారం అంటే ఆసక్తి ఉండటమే కాకుండ, తినడం-వండడం  ఒక ఆసక్తిగా (హాబీ) ఉన్న వ్యక్తి. వారు కొత్త వంటకాలు వండడం, రుచి చూడటం, అవి దొరికే ఆహారశాలలు, ప్రదేశాలకి వెళ్లి ప్రయత్నించడం, వగైరా చేస్తారు. వీరు ఉలవచారు-బిర్యానీ సినిమాలో ప్రకాష్ రాజ్ , చూపులు కలసిన శుభవేళ చిత్రంలో బ్రహ్మానందం - శ్రీలక్ష్మి వంటివారు.  

పై నిర్వచనానికి అయితే నేను సరిపోను. నాకు  ఇలా కొత్త వంటలు వండాలని -రుచులు చూడాలని  లేదు, ఊళ్ళో ఉన్న హోటళ్లన్నీ తిరగాలీ  అని, నెట్లో రెసిపీలు చూసి ప్రయత్నించాలని, జొమాటోల్లో సమీక్షలు వ్రాయాలని ఎప్పుడు లేదు.

కానీ నేను ఆహార ప్రేమికుడిని. తినే ఆహారాన్ని ప్రేమిస్తాను. రుచులని ఆస్వాదిస్తాను. ఆహారము సాధ్యమైనంతవరకు వృధా చేయను.  నా  కంచం ఎప్పుడు చివరికి శుభ్రంగా  ఉంటుంది - కరివేపాకులు లాంటివి కూడా ఉండవు.  ఇంట్లో వండింది మిగులుతుంది అని తెలిస్తే న కడుపులోకి పారేస్తాను.

ఇక వంటకాలకు వస్తే అది శాకాహారం అయితే చాలు - తినేస్తాను. అన్ని కూరలు తింటాను - కాకరకాయ, పొట్లకాయ, బీట్రూట్ లతో సహా .  పిల్లలు ఏదన్న కూర ఇష్టంలేదు అంటే ఒక్కటే చెప్తాను - "ఇష్టముంటే నచ్చినంత తిను, లేకపోతె కొంచెం తిను " .

అన్ని పళ్ళు తింటాను.  అన్ని స్వీట్లు తింటాను. అన్ని కారం  (హాట్) తింటాను.  పొడులు వేసుకుంటాను. అన్ని రకాల దోశలు  తింటాను.

పిండివంటలు ఎవ్వరు చేసిన తింటాను. ముఖ్యంగా వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం పండగలకోసం ఎదురు చూస్తుంటా .  ఆఖరికి ఇంట్లో ఉగాది పచ్చడి అందరూ  తలా ఒక చెంచా  తిన్నాక మిగతాది నేను మింగేస్తాను.

నేను పెద్ద నేర్పరిని కాకపోయినా , కూరలు-పప్పులు-సాంబార్లు-బిర్యానీలు  ఒక 5-6గురు తినేటట్లు వండగలను. ఇంట్లో వారానికి ఒక్కసారైనా  వంట చేస్తుంటా .

ఆసక్తి ఉన్నవారు నేను ఇంతకుముందు నా  ఆంగ్ల బ్లాగులో వ్రాసిన  ఈ క్రింది వ్యాసాలు చదవగలరు, ముఖ్యంగా శాకాహారం అంశంపైన

http://jb-journeyoflife.blogspot.com/2012/09/feast-fiesta.html
http://jb-journeyoflife.blogspot.com/2011/11/vegetarianism-vegetables-nutrition.html

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in