30, మే 2021, ఆదివారం

ఐటీ ఫీల్డ్లో డొమైన్ ఎంచిక ఎలా? ఒక టెక్నాలజీ వేరు వేరు డొమైన్ లేదా ఒకే డొమైన్ వేరు వేరు టెక్నాలజీలు వీటిలో ఏది సరైనది?

1. పండగ రద్దీ సమయాల్లో హైదరాబాదు విజయవా‌డ మధ్యన ప్రత్యేక సర్వీసులుగా సిటీ బస్సులు వేస్తారు ఎపుడైనా ఎక్కారా? ఒకసారి స్వతంత్రం వచ్చి ఎక్సిలరేటరు తొక్కేస్తారు. కానీ హైవే మీద వాళ్ళ అనుభవలేమి తెలిసిపోతుంది. 
2. లారీ తోలే వ్యక్తి కారు నడిపితే ఎపుడన్నా గమనించారా? 
3. మామూలు 800 కారు నడిపే వ్యక్తికి బీఎండబ్ల్యూ ఇస్తే ఊపిరి సినిమాలో కార్తీకి, లేదా పారసైటు సినిమాలో పేద తండ్రికి 
4. 15-20 ఏళ్ళ కిందటా, మీ ఊరులో రహదారులుగానీ, గమనిస్తే - అవే రహదారులుగానీ రద్దీ పెరిగిపోయింది, సైకిళ్ళు-రిక్షాలు కనుమరుగు అయ్యాయి. 
1 - అదే టెక్నాలజీ, అవే టూల్సు, డోమైను వేరు 
2 - అదే టెక్నాలజీ, అదే డోమైను, టూల్సు వేరు
3 - అదే డోమైనుగానీ టెక్నాలజీ - టూల్సు వేరు
4 - అదే డోమైనుగానీ పరిస్థితులు, నియమాలు మారిపోయాయి. 

పై ఉదాహరణలో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే టెక్నాలజీ, టూల్సు, డోమైను మారుతుంటాయి. Change is inevitable. బేసిక్స్, అంటే పై ఉదాహరణలో డ్రైవింగు, గట్టి పునాది ఉండాలి. ఐటీ ఫీల్డ్ లో బేసిక్స్ అంటే ప్రోగ్రామింగు, లాజికల్ రీజనింగ్, ఎనలిటికల్ ఎబిలిటీ, క్విక్ లర్నింగు - ఇవి చాలా ముఖ్యము. ఈ నేర్పులు ఉంటే ఏ టెక్నాలజీ, టూల్సు, డోమైను అయినా పని చేయచ్చు. 
డొమైను ఎంపిక - 
ఇలా డొమైను ఎంపిక అవకాశం దొరికిందంటే అదృష్టమే. 

ఎందుకంటే పెద్ద సంస్థలలో మనకు ఆ అవకాశం తక్కువ - మనలని అడగరు - ఏదో వర్టికల్ లో పడేస్తారు, ఆ తరువాత ఆ యూనిటులోనే వేరు వేరు ప్రాజక్టులు, లేదా వేరే క్లయింటుకు మారుస్తారు. కామన పూలుకు వస్తేగానీ వేరే వర్టికల్ లేదా డొమైనుకు మారలేరు - అపుడూ ఛాయిస్ తక్కువ. 
చిన్న సంస్థలలో వారు అన్ని రకాల డొమైను క్లయింట్లకు ప్రాజక్టులు చేస్తారు కాబట్టి ఇక్కడా ఎంచుకునే అవకాశం తక్కువ. 
పైన చెప్పింది వర్టికల్స్లో డెలివరీలో, టెస్టింగులో చేసేవారికి. అదే Pega, SAP, Salesforce ఇలా ప్రోడక్టు ఇంప్లిమెంటేషనులలో, బిగ్ డేటా - ఎనలిటిక్స్, వంటి హారిజాంటల్స్ లో చేసేవారు ఒకటి కన్నా ఎక్కువ డొమైన్లలో పని చేయాల్సి ఉంటుంది.

ఒక టెక్నాలజీ వేరు వేరు డొమైన్ లేదా ఒకే డొమైన్ వేరు వేరు టెక్నాలజీ 
సాధారణంగా మన ఇండియా ఐటీ వరకు డెవలపరు - లీడు స్థాయిలదాక ఒక టెక్నాలజీ వేరు వేరు డొమైన్ పర్లేదు. ఇంటర్వ్యూలలో టెక్నాలజీ చూస్తారు, డొమైను గుడ్ టు హ్యావ్. ఆ తరువాత భవిష్యత్తులో మీరు స్క్రం మాస్టరు, ప్రొడక్టు ఓనరు, టెక్నాలజీ మేనేజరు, ప్రిన్సిపల్ సాఫ్టువేరు ఇంజనీరు అవ్వాలనుకుంటే ఒకే డొమైను లోతుగా వెళ్ళాలి. మీరు టెక్నాలజీ ఆర్కిటక్టు అవ్వాలనుకుంటే T-shape - అంటే ఒక టెక్నాలజీ లోతుగా, మిగిలిన టెక్నాలజీలు కొంతమేర తెలియాలి. అలాగే ఒక డొమైను లోతుగా, మిగిలిన డొమైనులు కొంతమేర తెలియాలి. 

డిమాండ్ బాగా ఉన్న డొమైన్లు
 FSI (బ్యాంకింగు, ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా), రిటైల్, పవర్, లాజిస్టిక్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్ ఇపుడు బాగా డిమాండు ఉన్నవి. ఆయిల్, ఆటోమొబైలు వంటివి వన్నె తగ్గాయి. హైదరాబాదులోనే స్థిరపడాలి అనుకునేవారు FS లేదా ఫార్మా, లైఫ్ సైన్సెస్ వైపు మొగ్గు చూపచ్చు - ఎందుకంటే చాలా FS, ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీల క్యాప్టివ్స్ ఇక్కడ ఉన్నాయి. 

కొన్ని డిమాండ్ ఎక్కువ ఉండి సప్లై తక్కువ (niche) ఉన్న డొమైన్లు బాగా ప్యాకేజిలు ఇస్తాయి - ఉదాహరణకు ఏరోస్పేస్ - కానీ అవకాశాలు తక్కువ ఉంటాయి - ఎందుకంటే మీరు ఏ సంస్థ అయినా క్లయింటు బోయింగు లేదా ఎయిర్ బస్. 

చివరిగా ఒకే టెక్నాలజీ అయినా, ఒకే డొమైను అయినా ఎల్లకాలం ఒకేలా ఉండవు. ప్రతి మూడు-ఐదేళ్ళకు అప్ గ్రేడు అవుతుంటుంది. ఉదాహరణకు Visual Studio 2015, 2019 వర్షనుల మధ్యన చాలా అంతరం ఉంది. అలాగే 10 ఏళ్ళ కిందట ఆటో ఇన్సూరెన్సు వేరు, 
ఇప్పటిది వేరు. 30 ఏళ్ళ కిందట ఊళ్ళల్లో అంబాసిడరు ట్యాక్సీ నడిపినవారు 15 ఏళ్ళ కిందట ఇండికా ఇన్నోవాలు నడిపారు, ఇపుడు ఇంకా శక్తివంతమైన బండ్లు నడుపుతున్నారు.

నేర్చుకోవడం నిరంతర ప్రక్రియ, అది ఐటీవాళ్ళ సమస్య మాత్రమే కాదు. 

ఊపిరిలో కార్తీలా పైనున్న మేనేజర్లు-ఆర్కిటేక్ట్లు అందరిని పనికిరానివారిగా అనుకోకుండా, అందులో నాగార్జునలాంటివారిని పట్టుకొని వారి అనుభవాలు-టిప్సు తీసుకొని దూసుకుపోండి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in