30, నవంబర్ 2011, బుధవారం

తెలుగు‌ బ్లాగులు‌ - గూగులమ్మ‌ బొమ్మలు‌


మీరు‌ ఇంటర్నెట్‌లో విహరిస్తుండగా‌ ఏదో‌ ఒ క‌ మంచి‌ కధనో, సినీసమీక్ష‌నో, కవిత‌నో కనిపించింది‌. చదువుతుంటే‌ ఇంతకుముందే‌ అది‌ ఎక్కడో చదివినట్లనిపిస్తుంది‌. తరచి‌ చూస్తే‌ అది‌ మీరు స్వయంగా‌ రచించినది‌. మీ విలువైన‌ నిమిషాలు‌/గంటలు‌/రోజుల తపన‌.

అపుడు మీ మనస్స్థితేంటీ? ఆ విషయాన్ని‌ మీరెలా తీసుకుంటారు? పోనీలే‌ అతనికి‌/ఆమెకి‌ నచ్చి పెట్టుకున్నారు‌లే‌ అ ని‌తేలికగా‌ తీసుకుంటారా‌?‌ రగిలిపోతారా? గొడవ‌ చేస్తారా?

తెలుగు‌ బ్లాగు‌ల్లో ఏ విషయం‌ పై వ్రాసినా సందర్భానుసారంగా బొమ్మ లు‌ పెట్టడం‌, వాటిని‌ చదువర్లు‌ మెచ్చుకోవడం సాధారణం.గా కొన్నిసార్లు‌ ముచ్చటగా‌ ఉంటుంది‌ కూడా. అయితే‌ ఈ బొమ్మలు‌ సొంతంవి‌గాకుండా‌ (ఆత్రేయ‌గారులాంటివారు‌తప్ప) నెట్లోంచి ప‌(కొ‌)ట్టుకొచ్చినవే! దాన్నే‌ ముద్దుగా గూగుల‌మ్మ‌ అప్పిచ్చింది‌ అని రాసుకుంటున్నా‌రు.

ఏ తప్పు‌కైనా ఉండేటట్లు ఇలా బొమ్మలు‌ తెచ్చుకోవడానికీ‌ రెం డు కోణాలున్నాయి‌.

మొదటిది‌ నైతికత‌ (ఎథికల్‌) - పైన‌ చెప్పిన‌ట్లు‌ మన‌ది‌ వేరేవాళ్ళు‌ కొట్టేస్తే‌ మనకి‌ బాధ‌/కోపం అయితే మనం వేరేవాళ్ళవి‌ వాళ్ళ‌ అనుమతి‌లేకుండ‌ వాడుకోకూడదు.

రెండవది‌ చట్టబధ్ద త (లీగల్‌) - కొందరు‌ అనుమతి‌ తీసుకోకున్న‌, ఆ బొమ్మ‌ మూలం‌ (ఎక్కడినుండి‌ సేకరించిందో)‌ పెడితే సరిపోతుందనుకుంటారు‌. కానీ కొన్ని‌సైట్స్ అలా వాడడానికి ఒప్పుకోకపోవచ్చు. వారు‌ మీపై‌ చట్టప్రకారం చర్యలు‌ తీసుకోవచ్చు‌. మనం వారి‌ బొమ్మ‌ డౌ న్లోడు చేస్తే‌ వారికెలా‌ తెలుస్తుందా? దా‌నికి చాలా‌ మార్గాలున్నాయి‌. అతి‌ తేలికైన‌ మార్గం‌ రివర్స్ ఇమేజింగ్‌ టెక్నిక్‌ .

అయితే‌ అసలు‌ బొమ్మలు‌ పెట్టుకోలేమా? ఏవి‌ కాపీరైట్‌ లే నిబొమ్మలు? వాటిని‌ ఎలా వెతక‌డం?
 • ప్రతి‌ సెర్చ్ ఇంజిన్‌లో ఈ అవకాశం ఉంటుంది- గూగు‌ల్లో అయితే‌ ఎడ్వాంస్‌డ్ సెర్చ్ కి వెళితే‌ 'యూసేజ్‌ రైట్స్' అ నిఉంటుంది‌.
 • ఆ బొమ్మ‌ ఉన్న‌ సైట్లో కాపీరైట్‌ ఏమి‌ చెప్తుందో చూడండి.

మరి‌ మన‌ బొమ్మలు‌, మన‌ రచనలకి‌ కాపీరైట్‌ ఎలా పెట్టుకోవడం? దీనికోసం‌  క్రియేటివ్ కామన్స్ లాంటివి‌ కొన్ని లైసెన్సులు నిర్వచించాయి‌. ఉదాహరణకి‌ నా బ్లాగుకింద చూడండి‌ -  క్రియేటివ్ కామన్స్ యాట్రిబ్యూషన్-నోడిరైవ్స్ ౨.౫ ఇండియా లైసెన్స్కింద నమోదుచేయబడినది.క్లుప్తంగా మీరు నా రచనని ఉన్నదున్నట్లుగా (అంటే మార్చకుండ) లాభాపేక్షలేకుండ వ్యక్తిగత వాడుకకు నా పేరు‌ చెప్పుకొని‌ ఇతరులతో పంచుకోవచ్చును.


ఏదన్నా బ్లాగులో బొమ్మలుంటే నాకు నచ్చకపోవడానికి నైతిక‌, న్యాయ‌ కారణాలుగాకుండ‌ ఇతర కారణాలు కూడ‌ ఉన్నాయి‌ -
 • బ్లాగు‌ లోడ్‌ అవడానికి‌ (ముఖ్యంగా ఇండియాలో) సమయమెక్కువ‌ పడుతుంది.
 • మొబైల్‌ ఫోన్లలో పేజీ సరిగా చూపబడదు.
 • టకటకా చదవడానికి‌ అడ్డమొస్తుంటూంది.

తెలిసీ చేసేవారికి (! ఎవడు‌ చూసొచ్చాడులే, మనం బొమ్మ‌ ప(కొ)ట్టుకొచ్చుకుంటే ఎవడికి తెలుస్తుందిలే‌, తెలిసినా ఏం చేయగలరులే‌ అనుకునేవారికి‌) నేనేం చెప్పను‌. తెలియని‌వారి‌కి‌ అవగాహన‌ కోసం ఈచిన్ని‌ ప్రయత్నం. ఎవరినీ నొప్పించడానికి‌ కాదు.

ఇతరుల‌ మేధోహక్కులని‌ గౌరవించండి. కనీసం మూలం (సోర్స్ లింక్) ఇవ్వండి.

9 కామెంట్‌లు:

 1. మీరు చెప్పిన విషయాల్లో నాకు చాలా కన్ఫ్యూషన్ ఉంది.ముందర నేను చాలా గూగుల్ సర్చ్ చేసి నా బ్లాగ్ లో ఫోటోలు పెట్టేదాన్ని. ఈ మధ్య తగ్గించినా..పూర్తిగా మానేయ లేదు. ఇక ఈ జాగ్రత్తలు తీసుకుంటాను.

  రిప్లయితొలగించు
 2. నేను కూడ చాల విషయాలను నా బ్లాగు లో నుండి తొలగించాను కంప్యూటర్ ఎరా నల్లమోతు శ్రీదర్ గారు రాసినప్పటి నుండి ************
  సరికొత్త అగ్రిగేటర్ మీకు నచ్చుతుందేమ www.kootami.co.cc

  రిప్లయితొలగించు
 3. @కృష్ణప్రియ‌గారు‌: మీకు‌ కాపీరైట్‌గురించి‌ తికమక‌ పడ్డారా? లేదా నేను‌ రాసింది‌ గందరగోళంగా ఉందా?

  @అజ్ఞాత: మీరిచ్చిన‌ కూటమి‌ లంకె‌ పనిచేయట్లేదు‌!

  రిప్లయితొలగించు
 4. JB గారు,

  మీరు రాసిన వ్యాసం చదివే ముందు ఉన్న తికమక అది.
  నేను సందర్భానుసారం గా చాలా సార్లు గూగుల్ ఇమేజేస్ కెళ్లి చాలా కార్టూన్లు తెచ్చి నా బ్లాగ్ లో పెట్టాను.. ఈసారి నెమ్మదిగా సమయం ఉన్నప్పుడు ఒక్కోటీ వెనక్కి తీసేస్తాను.

  రిప్లయితొలగించు
 5. కృష్ణప్రియగారు: అయ్యో!‌ తీసేయమని‌ చెప్పట్లేదు‌, పెట్టేటపుడు‌ కాపీరైట్‌ చూసుకోమని‌ ఒక‌ జాగ్రత్త. ఐటీలో చాలా ఏళ్ళనుంచి‌ ఉన్నారు‌కాబట్టి మీకు‌ ఐపీ గురించి‌ తెలియచ్చు‌, మన‌ తెలుగు‌ బ్లాగుల్లో ఉండే చాలా మందికి తెలియకపోవచ్చని‌ రాశానంతే!

  రిప్లయితొలగించు
 6. నేను ఒక్క ఇమేజ్ కి కూడా కాపీ రైట్ చూసుకోలేదు :) అందుకే ఒక్కోటీ చూసి తీయటమో, మార్చటమో చేయాలి.. నెమ్మది గా చేస్తాను.

  ఈ కాపీ రైట్ విషయం మీద అంత అవగాహన లేక, ఒకరిద్దరిని అడిగితే, 'ఏం పర్వాలేదు.. పెట్టేయ్..' అన్నారని అలాగే పెడుతున్నాను.

  రిప్లయితొలగించు
 7. జ్యోతిర్మయిగారు: థాంక్సండి
  కృష్ణప్రియగారు‌:‌ అయితే, నా బ్లాగు‌ ఫలితం‌ దక్కింది‌ :-)

  రిప్లయితొలగించు
 8. మంచి,మంచి బ్లాగులను అందించాలనే లక్ష్యంతో ఈ బ్లాగ్ వేదిక {తెలుగు బ్లాగుల వేదిక}ను ప్రారంభించాను.ఈ వేదికలో 100 బ్లాగులకు తప్ప మిగతా వాటికి చోటు లేదు.మీ బ్లాగును కూడా దీనిలో అనుసంధానం చేయాలనుకుంటే బ్లాగ్ వేదిక నియమాలు పాటించవలసి ఉంటుంది.వివరాలకు క్లిక్ చేయండి.
  http://blogvedika.blogspot.in/

  రిప్లయితొలగించు

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in