నిన్న రైటర్ తమిళ డబ్బింగు సినిమా చూశాను. ఫేస్బుక్లో చాలా మంది పొగిడినట్లే మొదటి పది పదిహేను నిమిషాలు నచ్చింది - కింది స్థాయి పోలీసుల కష్టాలు, వారికి యూనియను ఉండడము కోసము ప్రధాన పాత్రధారి రైటరు / హెడ్ కానిస్టేబుల్ సముద్రఖని ప్రయత్నాలు - బాగుంది.
ఆ తర్వాత తిరుచ్చికి బదిలీ అయ్యాక అనుకోకుండా ఒక పీ హెచ్డీ విద్యార్థిని అక్కడి డీసీపీ స్థాయి అధికారి ఒక కేసులో ఇరికించడం, తనకు తెలీకుండా ఈ సముద్రఖని అందులో పాత్రధారి కావడము వరకు బాగుంది. ఇదేదో విశారణై లాగా, అంకురంలాగా ఒక సామాన్యుడి గురించి అనుకున్నా.
ఆ విద్యార్థిని కన్వర్టెడ్ గా, తన ఊరిలో వివక్ష అనుభవించినట్టు చూపించడము, కొన్ని సంభాషణలు కూడా ఓకే - ఇంకా అక్కడక్కడ ఊళ్ళల్లో పోలేదు కదా.
మొదటిసారి ఆ విద్యార్థి గదిలో కేసులో ఇరికించడానికి నక్సల్ సాహిత్యం, సింబల్స్ పెట్టినపుడు సందేహము కలిగింది. తమిళనాడులో నక్సలిజం నాకు తెలిసీ ఒక్క కర్ణాటక-కేరళ-తమిళనాడు సరిహద్దులలో తప్ప మిగతా చోట్ల అంత ప్రభావవంతముగా లేదు, అందులోనూ 2021లో. తిరుచిరాపల్లిలో నాకు తెలిసీ అసలే లేదు.
ఉత్తరాన్నించి వచ్చిన ఐపీఎస్ గా (కోపము వచ్చినపుడు హిందీలో మాట్లాడుతాడు) చూపించిన డీసీపీ పేరు త్రివేది శర్మ అని పెట్టారు. త్రివేది, శర్మ రెండూ విడిగా ఇంటిపేర్లు కానీ, రెండు కలిపి ఎవరూ పెట్టుకోరు. ఆ పోలీసు స్టేషను ఎస్సై పేరు పెరుమాళ్ (అగ్ర కులం) - ఎప్పుడూ గుళ్లు తిరుగుతున్నట్టు చూపించారు.
ఇక సముద్రఖని పాత్ర పేరు తంగరాజు నాకు తెలిసి తమిళనాడులో ఆధిపత్య కులాలు పెట్టుకునే పేరు కాదు. ఆ విద్యార్థికి ఆర్టీఐ కు సాయంచేసిన పాత్ర పేరు అన్వరు.
//స్పాయిలరు ఎలర్టు //
ఆ అమ్మాయి చచ్చిపోవడానికి కారణము ఆ డీసీ శర్మకు తక్కువ కులమైన ఆ అమ్మాయి గుర్రపు స్వారీ చెేయడము ఇష్టము లేకపోవడం అని చూపిస్తారు. అలాంటి ఉక్రోషము రాజపుత్లకు, క్షత్రియులకు ఉంటుంది కానీ బ్రాహ్మిణ్ కు ఎందుకుంటుంది?
ఒక నిస్సహాయ పోలీసు ఎంకటస్వామి కథ, లేదా ఒక అంకురం లాంటి కథ కాస్త చూస్తున్న కొద్దీ అలా కులవివక్ష అజండా సినిమాగా కనిపించసాగింది.
చివరి పేర్లలో (ఎండ్ క్రెడిట్స్) బైబిలోగ్రఫీ అని ’రామచంద్రన్ నాయర్’ అని పేరు వేశారు. నిర్మాత పా.రంజిత్ అని కనిపించింది. వెంటనే సినిమా మొత్తము చాలా డాట్లు కనెక్టు అయ్యాయి.
’రామచంద్రన్ నాయర్’ పేరు గూగుల్లో వెతికాను. ఎపుడో 1970లలో కేరళలో వర్ఘీసు అనే నక్సలైటును రామచంద్రన్ నాయరు అనే హెడ్ కానిస్టేబుల్ పై అధికారి బలవంతముపై కాల్చిన సంఘటనను 2022లోకి తెచ్చి, వారికి కావల్సిన అజండా కలిపి, అసలు టాపికు అయిన పోలీసు యూనియనును ముందర ఒక పది నిమిషాలు, చివరన ఒక పది నిమిషాలు కలివి వార్చిన పా.రంజిత్ కళాఖండము. ఇది అంతకు ముందు కమల్ తెలివిగా కమర్షియల్ సినిమాల్లో ఇరికిస్తే గత పదేళ్ల్ఘుగా డైరెక్టుగా తమిళ సినిమాల్లో వస్తుంది.
మనకు తెలీకపోతే అద్భుతమైన సినిమా అనుకుని అందులో మునిగిపోతాము. నాని కొత్త సినిమాలు కూడా అతనికి తెలిసో తెలీకో ఇదే దారిలో వెళ్లుతున్నాయి.
పైది నా వ్యక్తిగత పరిశీలన, అభిప్రాయము. మీకు నచ్చకపోతే ఇగ్నోరు చేసి తరువాతి పోస్టుకు వెళ్ళవచ్చును. నా అభిప్రాయము తప్పైతే ఎందుకో ఒక్కటే వ్యాఖ్య పెట్టి వెళ్ళవచ్చును. కానీ నానుండి రిప్లై ఆశించద్దు. నేను నా సమయాన్ని ఎటువంటి డిబేటుకు వృధాచేయను.
https://www.hindustantimes.com/india/ex-police-chief-sentenced-for-40-yr-old-naxal-murder-case/story-ucSXAKRNpfzyR20nj2FsZO.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.
ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in