ఒకటి కన్నా ఎక్కువ స్వరాలు (నోట్లు) కలిపి వినిస్తే హార్మనీ అంటారు. ఆంటే స్వరాలు పరస్పరం సామరస్యములో ఉండాలి. లేకపోతే కాకిగోల లాగా అ(వి)నిపించచ్చు.
మనం మెలడీ అంటే శ్రావ్యమైన సంగీతము అనే అర్థములో వాడతాము. పాశ్చాత్య సంగీతము ప్రకారము కొన్ని నోట్లు కలిపితే ఒక మెలడీ. పాశ్చాత్య సంగీతములో స్ట్రింగ్స్ (వయోలిన్, సెల్లో) ఒక మెలడీ వాయిస్తే, విండ్ వాయిద్యాలు (ట్రంపెట్, బ్రాస్) ఇంకో మెలడీ, గిటార్, కీబోర్డు వాయిద్యాలవారు వారి మెలడీ వాయిస్తారు.
పెర్కూషన్ వాయిద్యాలు (డ్రమ్స్), బేస్ గిటారు రిథమ్ ను ఇస్తాయి.
హార్మనీ, మెలడీ, రిథమ్ పాశ్చాత్య సంగీతములో ముఖ్య పాత్ర వహిస్తాయి.
ఇపుడు కౌంటరు పాయింట్ అంటే ఒకటి కన్నా వేరు వేరు మెలడీలు కలిపి వాయించడం - ఆ మెలడీలు విడివిడిగా విన్నా బాగుండాలి - అక్కడే హార్మనీకు మెలడీకు తేడా.
ఇలాంటి సంగీతాంశాలు పేరాలు వ్రాసేకన్నా ఆడియో - వీడియోలు రూపములో చెప్పడము తేలిక, క్రిందన వీడియోలు చూడండి.
సాధారణముగా పాశ్చాత్య సంగీతములో కౌంటరుపాయింటుకు గిటారు - వోకల్ / కోరస్, పియానో - గిటారు, గిటారు - స్ట్రింగ్స్, వాయిస్తారు.
1960ల వరకు తెలుగు పాటలలో ఆర్కెస్ట్రైజేషను మోనోగా ఉండేది - వీణ, సితారు, పియానో లాంటివి నోట్లు వాయిస్తుంటే వెనక రిథమ్ కు తబలా లేదా మృదంగం. 70లలో విశ్వనాధన్ లాంటివారు వెస్ట్రన్ సంగీతము తెచ్చినా నోట్లకు గిటారు, వెనక రిథమ్ కు పెర్కూషన్, డ్రమ్స్ తెచ్చినా మెలడీలు మోనోనే - అంటే ముందర పియానో కొన్ని స్వరాలు, తరవాత గిటారు కొన్ని స్వరాలు ఆలా.
ఇళయరాజా వచ్చి ఇలా వేరు వేరు మెలడీలు కలిపి వినిపించడము మొదలుపెట్టాడు. అప్పుడే కౌంటరుపాయింటును ప్రవేశపెట్టాడు. ఇళయరాజా గొప్పతనమేంటంటే కౌంటరుపాయింటుకు ఎలాంటి వాయిద్యాలు వాడాలి అని - రెండు గిటార్లు (అకౌస్టిక్, బేస్), వయోలిన్ - వయోలిన్, గిటారు - ఫ్లూట్, గిటారు - శాక్సో - కోరస్ - ఇలా చాలా కాంబినేషన్లు సినిమాలో ఎలాంటి సిట్యుయేషనుకు వాడాలి అన్నది బాగా తెలుసు.
రహమాన్ కూడా కౌంటరుపాయింటు బాగా వాడతాడు - కాకపోతే సింథసైజర్, కీబోర్డు ఎక్కువ ఉంటాయి. ఇళయరాజా 1995 తర్వాత చేసిన పాటలు కూడా (టైం, నిను చూడక నేనుండలేను కాలం నుండి) కొంత ఇలాగే ఉండి అంత ప్రాచుర్యం పొందలేదు. ఇవి తక్కువ వాడిన అంతఃపురము, పితామగన్, లాంటివే హిట్ అయ్యినాయి.
నేను ఒక సంగీత అభిమానినే గానీ నిపుణుడను కాదు. పైన సమాధానములో తప్పులుండచ్చు. క్రింది వీడియోలు, బ్లాగులు చూడండి.
కౌంటరుపాయింటుకు సింపుల్ నిర్వచనము పియానోపై -
ఇళయరాజా కౌంటరుపాయింటును వివరిస్తున్నాడు - 1.45 నుంచి
ఇళయరాజా పాటలలో కౌంటరుపాయింటు - అభిమాని వీడియో
ఒక అభిమాని బ్లాగులో -
http://geniusraja.blogspot.com/2008/08/counterpoint-with-guitar.html
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.
ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in