19, జులై 2023, బుధవారం

శ్రీరమణ గారు

 90 లలో ఆంధ్రప్రభ వీక్లీ ఇంటికి రాగానే కార్టూన్లు అన్నీ చదివేశాక ఆ తర్వాత మొదటి చదివే శీర్షిక శ్రీ ఛానల్. వ్యంగ్యం అంటే పరిచయమైనది అప్పుడే. కొన్నేళ్లు ఈయనకు ముళ్ళపూడి రమణ గారికి మధ్యన తికమక పడేవాడిని. ఆ తర్వాత ఒక మలయాళం అవార్డు సినిమా చూస్తున్నప్పుడు దాని మాతృక ఒక తెలుగు కథ అని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ కథ మిథునం అని ఈయన రాసినదే అని తెలిశాక గౌరవం, అభిమానం  పెరిగినది. వెంటనే బాపు గారి చేతిరాతతో ప్రింట్ చేసిన పెద్ద సైజు మిథునం కథ పుస్తకం కొన్నాను అప్పుడే పుస్తక ప్రదర్శనలో శ్రీ ఛానల్ పుస్తకం కనబడితే  కొనుక్కొని మళ్లీ మళ్లీ చదివి ఆస్వాదించాను. దేశాలు ఊర్లో తిరగడంలో చాలా పుస్తకాలు కోల్పోయిన దాచిపెట్టుకున్న అతి కొద్ది పుస్తకాలలో ఇది ఒకటి.

ఈరోజు శ్రీరమణ గారి విషయం తెలిశాక కొంత బాధగా ఉంది. 🙏😢

2 కామెంట్‌లు:

  1. తెలుగు సాహిత్యంలో మనందరం ఎప్పటికీ స్మరించుకునే అద్భుతమయిన కథలు సృజించారీయన.

    నాకూ మొదట్లో లైబ్రరీలో ఈయన పుస్తకం కళ్లబడగానే అప్రయత్నంగా ఠక్కున ముళ్లపూడి వారే గుర్తొచ్చేవారు.

    రిప్లయితొలగించండి

గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.

ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in