ఈ రెండూ మొదటిసారి పబ్లిక్ పరీక్షలు వ్రాసిన ఏడవ తరగతిలో జరిగింది. మాది ప్రయివేటు బడి కావడంతో ఒక ప్రభుత్వ బడిలో కేంద్రం ఇచ్చారు.
అప్పటికి జంబ్లింగ్ పధ్ధతి లేదు. అందుకని అన్ని పరీక్షలు ఒకే గది , ఒకే బల్లపై వ్రాసాను. ఇన్విజిలేటరు కూడా దాదాపు ఒక్కరే వచ్చారు (ఇది ముఖ్యం).
**** 1 ****
ఇక మొదటి అనుభవం సైన్సు పరీక్ష రోజు జరిగింది. అప్పట్లో మెయిన్ పేపర్ 2 గంటలు. ఆఖరి 30 నిముషాలు ఉందనగా బిట్ పేపర్ ఇచ్చేవారు. నేను ఎప్పటిలాగానే గంటన్నరలో ఛాయిస్ ప్రశ్నలతో సహా వ్రాసేసి, అలంకారాలు (హెడింగ్ అండర్లైన్లు వగైరా) చేసేసి గోళ్లు గిల్లుకుంటున్నా. ఇన్విజిలేటరు సారు వచ్చారు.
"ఏరా ! అన్ని రాసేసేవా? గోళ్లు గిల్లుకుంటున్నావ్" (ఆయన నాలుగు రోజులనుండి నన్ను చూస్తున్నాడు కావున, తెలుసు నేను బాగా రాస్తున్నానని)
"అవునా సార్!"
"ఏదీ చూపీ " అని పేపర్లు తీసుకున్నారు. ఆయనకి నేను గీసిన మూత్రపిండాలు (కిడ్నీ) బొమ్మ బాగా నచ్చింది. వెంటనే ఆ ఒక్క పేపరు తీసుకుని వెనక వరుసల్లో ఎవరో విద్యార్థికి ఇచ్చేశాడు చూచి గీసుకోమని. బహుశా ఆయనకి తెలిసినవాడు అనుకుంటా . ఎం చేస్తాం బిక్క మొహం వేయటం మినహా .
నాకు టెన్షన్ పెరిగిపోతుంది. నాకేమో 12 ఏళ్ళు, అవి మొదటి పబ్లిక్ పరీక్షలు.
బిట్ పేపర్ గంటకి ఇంకా 10 నిముషాలు ఉందనగా, నా పేపరుతోపాటు వాడి ఆన్సర్ షీట్ తెచ్చారు. "వాడికి గీయడం రావడంలేదుగానీ నువ్వే గీసిచ్చేయ్" అన్నారు.
ఇది లోకంతో , వ్యవస్థతో మొదటి పరిచయం :)
*** 2 ***
ఇది ఇప్పుడు చూసుకుంటే పెద్ద విచిత్రం కాదుగానీ , అప్పుడుం మా పన్నెండేళ్ల వయసుకి పెద్ద వింత.
తరువాతి పరీక్ష సోషల్ ఇక ఆ రోజు అన్నాక పేపరు లీకయింది. అదే ఆ తరువాత 3-4 ఏళ్ళు వరుస లీకులకి ప్రారంభం. నాకేమో సోషల్ కష్టమైన సబ్జెక్టు - మ్యాథ్స్-సైన్స్ కుమ్మేవాడినిగానీ.
ఏప్రిల్లో అయిపోవాల్సిన పరీక్ష, మేము ఉగాది-శ్రీరామనవమి గడిపాక, 2-3 గాలి దుమారాలు, ఎండాకాలం క్రికెట్లు అయ్యాక మేలో పెట్టారు. ఈ శ్రీరామనవమికి నాకు, నా బెస్ట్ ఫ్రెండ్కి ఒక గొడవ. వీటన్నింటితో చదువు అటకెక్కి, ఆ ఒక్క పరీక్షకి వెళ్లడం కొత్తయినది. అదే 'వింత' అనుభవం . బెస్టు ఫ్రెండుతో గొడవ పెట్టుకునందుకో ఏమో నాకు మొదటిసారి ఒక పరీక్షలో 60 కన్నా తక్కువ వచ్చాయి.
ఆ శ్రీరామనవమి గొడవ ఆసక్తి ఉన్నవారికి ఇక్కడ - https://jb-jeevanayanam.blogspot.com/2011/04/blog-post.html

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.
ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in