నేను వైద్యుడినిగానీ , ఆహార నిపుణుడినిగానీ, డైటీషియన్ని కాదు. ఇంట్లో పెద్దల సలహాలు, మా పిడియాట్రిషియన్ని సంప్రదించి ఈ క్రిందివి మా పిల్లలకి ఆ వయసులో పెట్టాం. ఇది కేవలం నా అనుభవం మాత్రమే. మీరు మీ సొంతంగా నిర్ణయించుకొని ఆచరించుకోండి -
- పొద్దున్నే పాలల్లో ఇడ్లి - రుచికి పటిక బెల్లం పొడి. పంచదార జలుబు చేస్తుంది.
- మధ్యాహ్నం-రాత్రి భోజనానికి : బియ్యం, పెసరపప్పు, కందిపప్పు కడిగి ఆరబోసి, మర బట్టించి (మిక్సీలో వేసుకోవచ్చు) - బాగా నీరు పోసి మెత్తగా ఉడికించాలి. ఈ మధ్యన కొందరు ఇది హాఫుడ్ లాగా అమ్ముతున్నారు కూడా - బాదాం పప్పులు, జీడీ పప్పులు లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి - కానీ పిల్లల అరుగుదలని బట్టి అవన్నీ నెమ్మదిగా వేసుకోవచ్చు.
- పెద్దవుతున్న కొద్దీ - అన్నం మెత్తగా వండి అందులో పప్పు కట్టు (పప్పు వండేటప్పుడు పైపైన నీరు తియ్యాలి - అది చాలా బలం), చారు , రసం, పెరుగు కలిపి పెట్టాము.
- నెయ్యి బాగా దట్టించాలి
- సెరిలాక్ లాంటివి అత్యవసరం మాత్రమే - అనగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు, తీరికగా పెట్టె సమయం-ఓపిక లేనప్పుడు, లేదా ఎప్పుడన్నా సాయంత్రం స్నాక్ లాగా .
- సాయంత్రం: అరటి పండు గుజ్జు, మామిడి పండు గుజ్జు, సపోటా గుజ్జు , యాపిల్ ఉడకపెట్టి మిక్సీవేసి ఆ గుజ్జు - ఇలా మార్చి మార్చి . దీనినికూడా ఇప్పుడు ప్రాసెస్డ్చేసి అమ్ముతున్నారు. ప్రయాణాల్లో ఇలాంటి డబ్బాలు పెట్టుకునేవారం - కానీ అరటిపళ్ళు లాంటివి దొరక్కపోతేనే ఇవి -
- శాకాహారి కానట్లయితే గుడ్డు తినెట్లయితే ఉడకబెట్టి తెలుపు పెట్టచ్చు. మా పక్కింటివారు ఆ తెలుపుని మిక్సీలో వేసి అన్నంలో కలిపేసి పెట్టేవారు.
ఇవి కాకుండా నా సొంత అభిప్రాయాలు -పైత్యం :-
- మనము భోజనం చేసేటప్పుడు పిల్లలు మన చుట్టూ తిరుగుతారు - మనం తినేవన్నీ వారికీ నాలికపై రాస్తూఉండాలి - అప్పుడు వారికీ అన్ని రుచులు తెలుస్తాయి. మా పిల్లలిద్దరికి నేను ఏడో నెలలోనే ఆవకాయ నాలుకపై రాశాను. పెద్దది కారం తింటుంది. అలాగే చిన్న చిన్న చపాతీ-అట్టు ముక్కలు ఏడాదిన్నర తరువాత పెడుతూ ఉండచ్చు. పిల్లలిద్దరూ రెండు నిండేలోపే అన్ని కూరలు - పచ్చిగా రుచి చూశారు .
- అన్నం వండేటప్పుడు అందులోనే క్యారట్ తురుము, రుబ్బిన పాలకూర, వాము-జీలకర్ర పొడి లాంటివి వేయచ్చు - బలం, వారికి రుచులు వస్తాయి. జీర్ణ శక్తి పెరుగుతుంది.
కొన్ని చేయకూడనివి -
- ఊరికే ఖాళీగా ఉంటారు కదాని బిస్కట్లు ఇస్తారు - బిస్కట్లు ఎక్కువ మైదాతో ఉంటాయి. త్వరగా అరగవు - ఆకలి మందగిస్తుంది.
- చిప్స్, లాలిపాప్స్, వంటివి వారానికి ఒక్కసారి కన్నా ఇవ్వకూడదు.
ఇవి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.
ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in