17, జూన్ 2023, శనివారం
ఏబీసీడీ ఉద్యోగులు
ఏబీసీడీ ఉద్యోగులు
---------------------
ప్రస్తుతము నడుస్తున్న క్వైట్ క్విట్టింగు గురించి నాన్నతో ఫోనులో మాట్లాడుతుంటే తొంభైలలో ఆయన బ్యాంకు ఆఫీసరుగా ఉన్నప్పుడు ఉద్యోగులు పని ఎలా ఎగ్గొడతారో చెబుతూ వీళ్ళు ఏబీసీడీ అని నాలుగు రకాలన్నారు.
ఏ – ఎవాయిడ్ - మనం కౌంటరు దగ్గరకు పోగానే మనల్ని తప్పించుకోవాలని చూస్తుంటారు. మేనేజరుకు, ఆఫీసరుకు దొరక్కుండా తిరుగుతుంటారు.
బీ - బ్లేమ్ - ఏదన్నా పని అవ్వకపోతే పక్కవాడిపైనో, సిస్టం పైనో తోయడం - సర్వరు డౌను అయ్యింది, హెడ్డాఫీసు పంపించలేదు, ఇలా..
సీ - కన్ఫ్యూజ్ - పని కోసం వచ్చిన సహోద్యోగిని, కస్టమరును తికమక పెట్టడం - ఈ కాగితం లేదు, ఇది ఈ సెక్షనులో కాదు, వేరే చోట ఇలా.
డీ - డీలే - కావాలని నానుస్తారు. విసుగొచ్చి బాసే చేసుకుంటాడు. కస్టమరు అర్జంటు కాకుంటే ఇంకోసారి వద్దాములే అని వెళ్ళిపోతారు.
నాన్న ఏ బ్యాంకో వేరే చెప్పక్కర్లేదు అనుకుంటా:-)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.
ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in