ఈ ఏప్రిల్ నా సాఫ్టువేరు కెరియరులో ఇరవై సంవత్సరము మొదలైనది. ఈ ఏడాది ఐటీ స్లో డౌను వలన గత ఏడెనిమిదేళ్లుగా ఉన్నంతగా క్యాంపస్ సెలక్షన్స్ జరగట్లేదు. దానితో కొందరు కజిన్సు, స్నేహితులు (అదే వారి పేరెంట్సు ) కొంత ఆందోళనలో, అయోమయంలో ఉన్నారు. వారితో మాట్లాడిన వాటి సారాంశం -
ఫ్రెషర్స్ అయినా అనుభవజ్ఞులకు అయినా ఉద్యోగ అవకాశాలకు రెండు ముఖ్యమైనవి కావాలి - 1. అవకాశము 2. వచ్చిన అవకాశాన్ని వాడుకుని ఉద్యోగం సంపాదించి స్థిరపరచుకునే నైపుణ్యము.
1. అవకాశము
మనం ఎంత బాగా చదివేవారమైనా, ఎంత విద్య ఉన్నా అవకాశము దొరనిదే మనకు నిరూపించుకునే వేదిక దొరకదు. ప్రతి సంవత్సరము లక్షలమంది ఇంజనీరింగు పూర్తి చేసి వస్తున్నప్పుడు ఆ లక్షలలో ఒకరైన మనకు ఎంపిక పరీక్ష (వ్రాత/ముఖ) అవకాశము ఎలా వస్తుంది.
- అదృష్టవశాత్తూ ఒకప్పటిలా ఫైలు పట్టుకుని తిండి మానేసి చెప్పులరిగేలా నగరములోని ఆఫీసులన్నీ ఎక్కిదిగే రోజులు కావు. చక్కగా మంచి రెజ్యూమె తయారు చేసుకుని అన్ని సంస్థల వెబ్ సైట్లలో అప్లై చేయండి.
- ఫ్రెషర్స్ ఉద్యోగాలు ప్రకటనలు పంచుకునే వాలంటరీ, వాణిజ్య వెబ్సైట్లు, పేజీలు ఎఫ్బీ, టెలిగ్రామ్ లలో చాలా ఉన్నాయి. ఉదాహరణకు - Frontlines Media
- నెట్వర్కింగు - ఆల్రడీ మీ రంగములో మీ సీనియర్లు, చుట్టాలు, కుటుంబ స్నేహితులు ఉంటే రిఫరెన్ను అడగండీ. టిప్సు తీసుకోండి. తెలియనవారు అయినా లింక్డిన్, కోరా, రెడిట్, మీడియమ్ లాంటి వేదికలపై పరిచయాలు పెంచుకోండి. ఏమీ ఆశించకుండా మాట సాయం చేసేవారు ఇంకా ఈ ప్రపంచములో ఉన్నారు.
- ప్రోఫైల్ బిల్డ్ - గిట్ హబ్, టాప్ కోడర్, లింక్డిన్ లాంటి చోట్ల ప్రోఫైల్ బిల్డ్ చేసుకోండి
2. నైపుణ్యము
అవకాశము దొరికడము సులువే, దాన్ని అంది పుచ్చుకొని ఎంపిక అవ్వడము, ఉద్యోగములో నిరూపించుకుని తరువాత స్థాయికి పోవడము అంతే ముఖ్యము.
నైపుణ్యములో ముందుగా కావలసినది ప్రోగ్రామింగు -
ఇంజనీరింగు మొదటి మూడేళ్లు పూర్తిగా ఎంజాయ్ చేశాక ఏడో సెమ్ లోనో, నాలుగవ సంవత్సరములోనో జ్ఞానోదయము వస్తుంది. అపుడు అమీరుపేటలోనో బెంగుళూరూలోనో ఏదో కోర్సు చేసి, సర్టిఫికేటు తెచ్చుకుంటే ఉద్యోగము వచ్చేస్తుంది అనుకుంటారు.
ఇలాంటి చాలా సంస్థలలోకోర్సులలో ఏ ప్రోగ్రాము కోర్సు అయినా చెప్పేది సింటాక్సు మాత్రమే. పూర్తి చేస్తే హలో వరల్డ్ వ్రాయడము వస్తుంది, ప్రోగ్రామింగు రాదు. ప్రోగ్రామింగు అంటే సింటాక్సు, లాజిక్ వ్రాయడము మాత్రమే కాదు - ప్రాబ్లం అర్థం చేసుకుని ఒక ఎఫిసియంట్ సొల్యూషన్ ఇవ్వగలగాలి - అనలిటికల్ ఎబిలిటీ ఉండాలి, డిజైన్ కాన్సెప్టులు తెలియాలి, అల్గారిథమ్స్, వాటిని ఆప్టిమైజ్ చేయడము తెలియాలి, డేటా స్ట్రక్చర్సును వాడుకోవడము రావాలి, క్రియేటివ్ థింకింగు ఉండాలి. ఇవన్నీ చాలా మంది నేర్పరు. వారు ఇచ్చే సర్పిఫికేటు మీ రెజ్యూమె షార్టు లిస్టు చేయడానికి ఉపయోగపడచ్చు, కానీ ఇంటర్వ్యూ క్లియర్ చేయడానికి, ఉద్యోగములో మీ పనికి ఉపయోగపడదు.
మిమ్మల్ని ఇండస్ట్రీ రెడీ చేస్తాము, మూడు నెలలు - రెండేళ్ళ కోర్సులు అని కొత్తగా కొందరు మొదలుపెట్టారు. ఎన్ఎసార్, నాస్కామ్ వంటి వారితో టై అప్ అని చెప్పుకుంటారు. ఇంగ్లీషు కోరాలాంటి చోట్ల ఫేకు రివ్యూలు ఇప్పించుకుంటారు. జాబ్ గ్యారంటీ, వచ్చాక రెండు నెలల జీతం, సీటీసిలో పది శాతం, ఇలా వ్రాయించుకుంటారు. వీటిలో 90 శాతము ఫేక్. నమ్మకండి.
మీకు ప్రోగ్రామింగు బాగా రావాలంటే మీరు చేయాల్సినవి -
- ఏదైనా ప్రాబ్లం తీసుకోండి - జోసెఫస్ ప్రాబ్లం , ఎయిట్ క్వీన్స్ చెస్ పజిల్ లాగా సాఫ్టువేరు కావచ్చు లేదా కాలిక్యులేటరు, ఏదన్నా చిన్న యాప్, గేమ్ కావచ్చు - మొదలు పెట్టి, డిజైను చేసి, లాజిక్ వ్రాస్తే మీకు ప్రోగ్రామింగు స్కిల్స్ పెరుగుతాయి.
- హ్యాకర్ ర్యాంక్, కోడ్ షెఫ్ లాంటి సైట్లలో రిజిస్టరు చేసుకుని ప్రోగ్రామింగు ప్రాబ్లంస్, పజిల్సు, ఎసైన్మంట్లు చేయండి. లింక్డిన్ స్కిల్ ఎసైన్మంట్లు కూడా వ్రాయచ్చు.
- గిట్ హబ్ లాంటి చోట్ల ఓపెన్ సోర్సు ప్రోగ్రామింగు కోడ్ ఉంటుంది. చదివి మంచి కోడు ఎలా వ్రాస్తారో తెలుసుకోండి.
మెటా, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలు కొంత అడ్వాన్స్డ్ కోడింగు ప్రశ్నలు అడుగుతాయి. ఇన్ఫోసిస్, విప్రో లాంటి సర్వీసు ప్రోవైడరు కంపెనీలు ప్రోగ్రామింగుతో పాటు వ్రాత పరీక్షలో అనలిటికల్ ప్రశ్నలు, ఇంగ్లీషు గ్రామరు అడుగుతాయి.
ఇంగ్లీషు గ్రామరుతో పాటు, ఇంగ్లీషు స్పీకింగు, సాఫ్టు స్కిల్స్ కూడా ముఖ్యమే. గ్రూపు డిస్కషన్స రావాలి. వీటికి మీరు ఇంజనీరింగులో ఉండగానే తయారు అవ్వడము మొదలుపెట్టాలి.
మీరు కోర్సులే చేయాలి అనుకుంటే - ప్రస్తుతము మూడు స్ట్రీములు హాట్గా నడుస్తున్నాయి -
- ఫుల్ స్టాక్ డెవలపరు (ఫ్రంట్ ఎండ్ అంటే హెచ్టీఎమెల్, జావా స్క్రిప్టు, ఏంగులర్, వ్యూ వంటివి, బ్యాక్ ఎండ్ అంటే డాట్నెట్, జావా, పైథాను లలో ఏదో ఒక భాషలో రెస్టు ఏపీఐలు వ్రాయడము, డేటాబేసులో లిన్క్యూ, సీక్వెల్ లలో క్వెరీలు, స్టోర్డు ప్రోసీజర్లు వ్రాయగలగాలి),
- ఏఐ – ఎంఎల్ (పైథాన్/ఆర్, స్టాటిస్టికల్ మోడల్స్),
- డేటా సైన్స్(స్టాటిస్టికల్ మోడల్స్, క్వెరీలు, బిగ్ డేటా, ట్రెండ్ ఎనాలసిస్)
పై మూడింటిలో ఏదోక స్ట్రీము ఎంచుకుంటే మీకు ఆన్లైనులో చాలా లర్నింగు ప్లాట్ఫాంలు ఉన్నాయి - కొన్ని ఫ్రీ, కొన్ని డబ్బులకు - ప్లూరల్ సైట్, కోర్స్ ఎరా, యూడెమీ లాంటి వాటిలో ఏదోకటి చూసుకుని చేయవచ్చును. అమీరుపేట దాకా వెళ్లాలని లేదు.
కానీ పైన చెప్పినట్లు, పై మూడు కోర్సులు మొదలుపెట్టే ముందర ప్రోగ్రామింగు నైపుణ్యము ముఖ్యము.
నైపుణ్యము పెంచుకుని మనం రెడీగా ఉంటే అవకాశము వచ్చినపుడు నిరూపించుకోవచ్చు.
https://qr.ae/pGzMrC
Best and honest IT career advice to the youngers given so far on telugu blogs.
రిప్లయితొలగించండిThanks for sharing your experience, మా పెద్ద బాబు karanataka cet లో మంచి ర్యాంక్ తీసుకొన్నాడు మా ఇంట్లో అందరూ అకౌంట్స్ background వాడికి cs తీసుకోవాలా AIML data science ఆ అనేది అర్థం కావట్ల మీరు సలహా చెప్పగలరా please
రిప్లయితొలగించండిAIML డేటా సైన్సులో నేర్పేవాటికి ఫౌండేషను సీఎస్ఈ లో ఉంటాయి - AIML డేటా సైన్సు చదవాలన్నా ప్రోగ్రామింగు రావాలి - పైథాన్, ఆర్, స్టాటిస్టికల్ అల్గారిథమ్స్ నేర్పిస్తారు - అవన్నీ బేసిక్స్ సీఎస్ లో ఉంటాయి.
రిప్లయితొలగించండిThank you very much sir
తొలగించండిJB గారు, కొత్త వారికి చాలా చాలా ఉపయోగించే మంచి సలహాలను అందించారు. ఎందరికో ఇవి మార్గం చూపిస్తాయని ఆశిస్తున్నాను.
రిప్లయితొలగించండికోబాల్ నేర్చుకోండర్రా డిమాండ్ అండ్ సప్లై లో మీరే ముందుంటారు.
రిప్లయితొలగించండి☕️ కాఫీ లు, 🐍 కొండచిలువల ఈ కాలంలో COBOL ఇంకా బతికుందంటారా “జిలేబి” గారూ?
తొలగించండిఏ రాయైతే నేమండీ విన్న కోటవారు డబ్బులు రాల్తాయా అదీ క్రైటీరియా :)
రిప్లయితొలగించండిబావున్నారా
మీ స్పందనకు నెనర్లు జిలేబి, శ్యామలీయం, విన్నకోట గార్లు 🙏
రిప్లయితొలగించండిజిలేబి గారూ, మీ వ్యాఖ్య 😀