నా ముందటి వ్యాసంలో వాడుక తెలుగు కాపాడుటకు ప్రయత్నించాలని చెప్పాను.అందులో భాగంగా కొన్ని సూచనలు. ఇవన్నీ మీలో చాలా మందికి తెలిసినవే. అయినా తెలిసినవారికి గుర్తు చేయడానికి, తెలియనివారికి తెలపటానికి ఈ ప్రయత్నం.
గత దశాబ్దంగా వాడుక తెలుగులో వచ్చిన మార్పుల్లో ముఖ్యమైనది కాలమానాలను ఇంగ్లీషులో సూచించడం. అవి క్షణాలైనా (సెకండ్స్), నిమిషాలైనా (మినిట్స్), గంటలైనా (ఆఁర్స్, అదేనండీ హవర్స్), తేదీలైనా (డేట్స్), వారాలైనా (వీక్స్), సంవత్సరాలైనా (ఇయర్స్) గానీండి.
- మొన్న, నిన్న, నేడు(ఇవాళ,ఇయ్యాల), రేపు, ఎల్లుండి ముద్దు; డేబిఫోర్ యెస్టరడే, యెస్టరడే, టుడే, టుమార్రో, డే యాఫ్టర్ టుమార్రో వద్దు
- ఆదివారం, సోమ,... శనివారాలు ముద్దు; సండే, మండే,... శాటర్‌డే వద్దు
- ఒకటో తేదీ/తారీకు, పదోరోజు ముద్దు; ఫష్టు, టెన్త్‌డే వద్దు
- రెండు గంటలు, మూడింటికి, నాలుగున్నర, అయిదుంబావు ముద్దు; టూ అవ్వర్సు, త్రియ్యోక్లాకు, ఫోరుథర్టీ, ఫయవుఫిఫ్టీను వద్దు
- తెల్లవారుజామున, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, పగలు ముద్దు; ఎర్లీ మార్ణింగు, మార్ణింగు, ఆఫ్టర్‌నూను, ఈవెనింగు, నైటు, డే వద్దు.
- ముప్పయ్యేళ్ళు, రెణ్నెల్లు, పంతొమ్మిదివందల ఎనభై, నిరుడు, వచ్చే నెల ముద్దు; థర్టీఇయర్స్, టూ మంత్స్, నైన్టీన్ ఎయ్‌టీ, లాస్టియర్, నెక్స్ట్ మంత్ వద్దు.
- పుట్టినతేదీ, పుట్టినరోజు, వయస్సు ముద్దు; డేట్ ఆఫ్ బర్త్, బర్త్డే, ఏజ్ వద్దు.
అందుకని (సో), ఇకనుండి (నెక్స్టైంనించీ) సమయాన్ని (టైంని) తెలుగులోనే సూచించడానికి ప్రయత్నించండి.
చి.మా.: నేను పైనిచ్చిన తెలుగు మాటలు కృష్ణాగుంటూరుల్లో కొందరు వాడే తెలుగు. మీరు మీ యాస ప్రకారం వాడచ్చు. అది తెలుగైతే చాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
గమనిక: వ్యాఖ్యల్లోని విషయమునకు సంబంధిత వ్యాఖ్యాతలే బాధ్య్లులు. బ్లాగు యజమానికి ఎటువంటి సంబంధములేదు. ఒక వ్యాఖ్య ఎవరికైన ఇబ్బందికరమనిపించినా, నాకు తెలిపినచో తగుచర్య తీసుకొనబడును.
ధన్యవాదములు.
~జేబి.
yjbasu510@yahoo.co.in